శ్రీశైలం దేవస్థానం వైద్యశాల స్థానికులకు , భక్తులకు విశేష సేవలు అందిస్తోంది . ఆదివారం ఈ వైద్యశాలలో ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు . కర్నూలుకు చెందిన రేడియాలజీ వైద్యులు డా. ఆదినారాయణ రెడ్డి . స్త్రీల వ్యాధి నిపుణులు డా.స్నేహలత రెడ్డి ఈ పరీక్షలు నిర్వహించారు .
ఆదివారం 60 మందికి పైగా స్థానికులు , భక్తులు పరీక్షలు చేయించుకున్నారు .
గర్భిణులకు పరీక్షలు , మూత్రపిండాలు , ఇతరత్రా వైద్య పరీక్షలు జరిపారు . దేవస్థానం వైద్యశాలలో పలు పరికరాలు అందుబాటులోకి వచ్చాయి . హైదరాబాద్ లోని కామినేని ఆసుపత్రి వారు సుమారు రూ. 16 లక్షల వులువచేసే అల్ట్రా సౌండ్ స్కానింగ్ యంత్రాన్ని విరాళంగా ఇచ్చారు . దేవస్థానం వారు కుడా సుమారు రూ. 9 లక్షల విలువైన నూతన వైద్య పరికరాలను ఏర్పాటు చేసారు .
ఈసీజీ మిషన్ , కార్డియాక్ మానిటర్ , వెంటిలేటర్ , డిఫిబ్రిలేటర్, అధునాతనమైన సిరంజ్ పంప్ మిషన్ తదితర వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయి .
Post Comment