శ్రీశైలం డ్యాంకు గరిష్టస్థాయిలో నీరు వచ్చి చేరుతుండడంతో నీటి విడుదలను భారీగా పెంచారు. మొత్తం 8 గేట్లను ఒక్కోటి 10 అడుగుల మేర ఎత్తి 2 లక్షల 21 వేల 296 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.నాగార్జునసాగర్ కు 3 లక్షల 9 వేల 743 క్య్యూసెక్కులు విడుదల చేస్తున్నారు . ఎగువన కృష్ణా నది పరివాక ప్రాంతాల నుంచి వరద ప్రవాహం భారీగా పోటెత్తుతుండడంతో శ్రీశైలం డ్యాం 8 గేట్లు ఎత్తి నీటి విడుదల ప్రారంభించారు. కృష్ణా నదిలో వరద పరవళ్లు తొక్కుతోంది. వారం పది రోజులుగా వరద పెరుగుతున్నా సోమవారం క్రమంగా తగ్గిపోయింది. సాయంత్రం మళ్లీ భారీగా పెరగడంతో మూసేసిన గేట్లన్నీ ఎత్తేశారు. 8వ గేటును కూడా ఎత్తి ఏకంగా 3 లక్షల 9 వేల 743 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం డ్యాం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.10 అడుగులు ఉంది. డ్యాం కెపాసిటీ 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 210.5133 టీఎంసీలు ఉంది. తెలంగాణ పరిధిలోని ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని పూర్తి స్థాయిలో నిర్వహిస్తూ 42,378 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ఏపీ పరిధిలోని కుడి గట్టు జల విద్యుత్ కేంద్రంలో కూడా పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 30 వేల 781 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు.తుంగభద్ర పరివాహక ప్రాంతంలోని సుంకేశుల నుంచి 22 వేల 393 క్యూసెక్కుల నీరు హంద్రీ నుంచి మరో 200 క్యూసెక్కుల నీరు వచ్చి కృష్ణా నదిలో చేరుతోంది. శ్రీశైలం డ్యాం కు మొత్తం 2 లక్షల 35 వేల 188 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం డ్యాం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.10 అడుగులు ఉంది. డ్యాం కెపాసిటీ 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 210.5133 టీఎంసీలు ఉంది. ఆల్మట్టి నారాయణపూర్ ల నుంచి భారీగా దిగువకు నీరు విడుదల చేస్తుండడంతో జూరాల కు ఏకంగా 2 లక్షల 12 వేల 593 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. రెండు లక్షల మార్కు దాటడం ఇదే తొలిసారి. కృష్ణా నది నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమ కాలువల కోసం 11 వేల క్యూసెక్కులు హంద్రీ నీవా ద్వారా 1688 క్యూసెక్కులు విడుదల చేస్తుండగా తెలంగాణ పరిధిలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 1600 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. రాత్రి 7వ గేటును కూడా ఎత్తి నీటి విడుదల ప్రారంభించిన అధికారులు మంగళవారం 8వ గేటును కూడా ఎత్తి దిగువన నాగార్జునసాగర్ కు విడుదల చేస్తున్నందున మొత్తం పరిస్థితి మారింది.