శ్రీశైలం అభివృద్ధి ప్రణాళికను రూపొందించేందుకు విస్తృతంగా కొనసాగిన క్షేత్ర పరిశీలన

శ్రీశైల దేవస్థానం:రానున్న 20-25 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని క్షేత్రాభివృద్ధికి  రూపొందించాల్సిన అభివృద్ధి ప్రణాళిక, చేపట్టాల్సిన పనులకు సంబంధించి ఈ రోజు కూడా  దేవస్థానం అధికారులు క్షేత్రంలో విస్తృతంగా పర్యటించారు.రాష్ట్ర దేవదాయశాఖ కార్యదర్శి  ఎం.గిరిజాశంకర్ సూచనల మేరకు మాస్టర్ ప్లాన్ రూపకల్పన నిపుణులు  విశాల్ కుంద్ర, సూర్యశ్రీనివాస్, ఏకామ్ సంస్థ, ఢిల్లీ వారు కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రస్తుత క్యూకాంప్లెక్స్, పంచమఠాలు, గోశాల, పాత పుష్కరిణి, కొత్త పుష్కరిణి, పలు ఉద్యానవనాలు, అంతర్గత రహదారులు మొదలైనవాటిని పరిశీలించారు.పర్యటన అనంతరం కార్యనిర్వహణాధికారి వారి కార్యాలయములో అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనపై సమావేశం నిర్వహించారు.

శ్రీశైలక్షేత్ర ప్రాశస్త్యం, క్షేత్ర చారిత్రకత విశేషాలు, ప్రస్తుతం సగటున క్షేత్రాన్ని సందర్శిస్తున్న భక్తుల సంఖ్య, శ్రావణమాసం, కార్తికమాసం, మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు, ఉగాది మహోత్సవాలు మొదలైన సందర్బాలలో ఉండే భక్తులరద్దీ, రాబోవు సంవత్సరాలలో పెరగనున్న భక్తులరద్దీ మొదలైన అంశాల గురించి సమావేశంలో చర్చించారు.

ఈ సర్వే ఆధారంగా ఏకామ్ సంస్థవారు ఆయా అంశాలను గురించి ఉన్నతాధికారులతో చర్చించి అభివృద్ధి ప్రణాళిక నివేదికను అందజేయనున్నారు.ఈ పర్యటనలో కార్యనిర్వహణాధికారితో పాటు దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మురళీ బాలకృష్ణ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు నరసింహారెడ్డి, శ్రీనివాసరెడ్డి, అసిస్టెంట్ ఇంజనీర్లు తదితర ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

* Sakshi Ganapathi Abhihsekam,  Jwaala Veerabhadraswamy Pooja performed in the temple today.

* G.Ragava Reddy , CMD,Telangana State Southern Power Distribution Corporation Limited Hyderabad and  C. Srinivasa Rao. JMD. TS TRANSCO visited the temple today. officials received with temple maryaadha.
print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.