శ్రీశైల దేవస్థానానికి హుండీల లెక్కింపులో రూ. 4,90,10,126/-లు నగదు రాబడి

శ్రీశైల దేవస్థానం:ఈ నెల 4 నుండి 14 వరకు జరిగిన  మహాశివరాత్రి  బ్రహ్మోత్సవాల హుండీల లెక్కింపు ఈ రోజు (18.03.2021) న జరిపారు. బ్రహ్మోత్సవాల కంటే ముందు  ఈ నెల 2వ తేదీన హుండీలను లెక్కించారు. బ్రహ్మోత్సవాలు 11 రోజులు నిర్వహించగా, మొత్తం 16 రోజుల (2.03.2021 నుండి 17.03.2021) హుండీల లెక్కింపు ఈ రోజు చేపట్టారు. 

ఈ లెక్కింపు ద్వారా దేవస్థానానికి మొత్తం రూ. 4,90,10,126/-లు నగదు రాబడిగా లభించింది.

16 రోజులకు ఇంత అధిక మొత్తం లో హుండి రాబడిగా లభించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. వాటితో పాటు 21 యు.ఎస్.ఎ డాలర్లు, 50 ఇంగ్లాండ్ పౌండ్లు, 5 సౌదీరియాల్స్, 5 యూరోస్, 2 సింగపూర్ డాలర్లు మొదలైన విదేశీ కరెన్సీ కూడా హుండీల లెక్కింపులో లభించాయి. ఈ హుండీ లెక్కింపులో దేవస్థాన సిబ్బందితో పాటు శివ సేవకులు పాల్గొన్నారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.