శ్రీశైల దేవస్థానం:14.12.2020:
• ఈ రోజు ( 14.12.2020)తో ముగియనున్న కార్తీకమాసోత్సవాలు
• నవంబరు 16న ప్రారంభమైన కార్తీకమాసోత్సవాలు
• నేడు కార్తీక చివరి సోమవారం ( అయిదవ సోమవారం)
• కోవిడ్ నిబంధనలను పాటిస్తూ కార్తీకమాసోత్సవాల నిర్వహణ
• వేకువజాము నుంచే దర్శనాలకు విచ్చేసిన భక్తులు
• శ్రీస్వామిఅమ్మవార్ల లఘుదర్శనానికి ( దూరదర్శనానికి) మాత్రమే అవకాశం
• కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అయిదు విడతలుగా ఆర్జిత అభిషేకాలు
• ఆర్జిత అభిషేకాలలో మొదటి విడతను ఉదయం. గం. 6.30 లకు: రెండవ విడతను ఉదయం గం. 8.30లకు: మూడవ విడతను ఉదయం గం.11.30లకు: నాలగవవిడతను మధ్యాహ్నం గం. 1.30లకు : అయిద విడత సాయంత్రం గం.6. 30లకు .
• కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రెండు విడతలుగా ఆర్జిత హోమాలు నిర్వహణ.
• రుద్రహోమం – మృత్యుంజయ హోమాలలో మొదటి విడత ఉదయం గం. 8.00లకు, రెండవ విడత గం. 9.30లకు.
• చండీహోమం మొదటి విడత ఉదయం గం. 7.30లకు రెండవ విడత ఉదయం గం.10.00లకు.
• భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లలో వేడిపాల వితరణ
• భక్తులకు పొట్లాల రూపంలో అన్నప్రసాదాల అందజేత
• కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఈ రోజు సాయంత్రం “పుష్కరిణి” వద్ద లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి
• కోవిడ్ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని పరిమిత సంఖ్యలో మాత్రమే పుష్కరిణి హారతికి భక్తులకు అనుమతి
• లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి కార్యక్రమాలు శ్రీశైల టి.వి., యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం.