శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానంలో ఈ నెల 17వ తేదీ నుండి 25వ తేదీ వరకు దసరా మహోత్సవాలు జరుగనున్నాయి.
ఈ మహోత్సవ నిర్వహణకు సంబంధించి చేయాల్సిన ఆయా ఏర్పాట్లపై ఈ రోజు 3న సాయంకాలం సమీక్షా సమావేశం జరిగింది.
ఉభయదేవాలయాల ప్రధానార్చకులు, స్థానాచార్యులు, అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు తదితర సిబ్బంది ఈ సమీక్షా సమావేశములో పాల్గొన్నారు.
ముఖ్యంగా కోవిడ్ నివారణ చర్యలను పాటిస్తూ ఉత్సవాలను నిర్వహిస్తారు. కాగా సమావేశములో ఈ క్రింది నిర్ణయాలుతీసుకున్నారు. ఉత్సవరోజులలో శ్రీస్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్ని పరిపూర్ణంగా జరిపించాలని సంబంధితులకు సూచించారు. వైదిక కార్యక్రమాల నిర్వహణలో సమయపాలన ఖచ్చితంగా పాటించాలని కూడానిర్ణయించారు. ఉత్సవ సమయములో జరిగే విశేషపూజాదికాలు, జపపారాయణలు మొదలైనవాటిని అర్చకస్వాములు భౌతికదూరాన్ని పాటిస్తూ నిర్వహించనున్నారు.కోవిడ్ నివారణ చర్యలలో భాగంగా ఈ సంవత్సరం దసరా ఉత్సవాలలో శ్రీస్వామి అమ్మవార్ల గ్రామోత్సవం నిర్వహించే అవకాశం లేదు. ఉత్సవ సమయములో ప్రతిరోజూ ఆలయ ఉత్సవం మాత్రమే జరుపుతారు. ఉత్సవాల సందర్భంగా శ్రీస్వామివారికి విశేష అర్చనలు, అమ్మవారికి నవావరణపూజలు, రుద్రయాగం,చండీయాగం, అమ్మవారి ఉత్సవమూర్తికి నవదుర్గ అలంకరణలు, స్వామి అమ్మవార్లకు వివిధ వాహనసేవలు జరుగనున్నాయి. అక్టోబరు 17వ తేదీన ఉదయం 8.30గంటలకు అమ్మవారి ఆలయ యాగశాల ప్రవేశముతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ప్రారంభపూజలలో వేదస్వస్తి, ఉత్సవసంకల్పం, గణపతిపూజ, పుణ్యాహవచనం, కంకణపూజ,
దీక్షాసంకల్పం, ఋత్విగ్వరణం, అఖండదీపస్థాపన, వాస్తుపూజ, మండపారాధన,చండీకలశస్థాపనలు జరుపుుతాారు. మరిన్ని వైదిక కార్యక్రమాలు కూడా దేవస్థాన నిర్ణయం మేరకు జరుగుతాయి.
అక్టోబరు 25వ తేదీన ఉదయం యాగపూర్ణాహుతి, కలశోద్వాసన, అవబృథస్నానంతో ఉత్సవాలు ముగియనున్నాయి. అక్టోబరు 25వ తేదీన ఆయుధపూజ, సాయంకాలం శమీ పూజ వుంటాయి. ప్రతిరోజూ యథావిధిగా శ్రీస్వామివార్ల కల్యాణం, ఏకాంత సేవ వుంటాయి. ప్రాంగణములో విద్యుద్దీపాలంకరణ, పుష్పాలంకరణ చేస్తారు.
ఉత్సవాలలో విశేష అలంకార సేవలు – వాహనసేవలు:తేది,వారం,శ్రీఅమ్మవారి అలంకారం – వాహనసేవలు
| 17.10.2020 | శనివారం శైలపుత్రి భృంగివాహనం
18.10.2020 | ఆదివారం | బ్రహ్మచారిణి మయూరవాహనం
19.10.2020 | సోమవారం | చంద్రఘంట రావణవాహనం
20.10.2020 | మంగళవారం | కూష్మాండదుర్గ కైలాసవాహనం
21.10.2020 | బుధవారం | స్కందమాత శేషవాహనం
22.10.2020 | గురువారం కాత్యాయని హంసవాహనం
23.10.2020 | శుక్రవారం కాళరాత్రి గజవాహనం
24.10.2020 | శనివారం మహాగౌరి నందివాహనం
25.10.2020 | ఆదివారం | సిద్ధిదాయిని (ఉదయం ) – అశ్వవాహనం (ఉదయం)
భ్రమరాంబాదేవి నిజాలంకరణ | నందివాహనం ( సాయంత్రం)