శ్రీశైల దేవస్థానం సందర్శకులకు మరిన్ని సౌకర్యాలు- ఈ ఓ ఆదేశాలు

శ్రీశైల దేవస్థానంలో భక్తుల అవసరార్థం మరిన్ని చర్యలు తీసుకోవాలని ఈ ఓ ఆదేశించారు. బుధవారం ఈ ఓ వివిధ విభాగాల బాధ్యులతో సమీక్ష జరిపారు. ముఖ్యమైన పండుగలు, వివిధ ఉత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం దర్శన వేళలు స మీక్షించి తగిన మార్పులు చేయాలని ఈ ఓ ఆదేశించారు. మంచినీటి సౌకర్యం పెంచాలని, పారిశుధ్య పనులు చక్కగా నిర్వర్తించాలని ఆదేశించారు. అంటు వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రతలు తీసులోవాలని ఈ ఓ ఆదేశించారు. ఈ శ్రావణ మాసంలో , ఇతర పండుగలు, ఉత్సవాలకు భక్తులు  అధిక సంఖ్యలో వస్తారని , వారికి యే ఇబ్బందులు కలగకుండా చూడాలని ఈ ఓ ఆదేశించారు. క్యూ లైన్లలో భక్తులకు నీరు, అల్పాహారం, పిల్లలకు బిస్కట్లు ఇవ్వాలని  ఈ ఓ సూచించారు. అవసరమైన మేరకు లడ్డూ ప్రసాదాలు తయారు చేసి అందుబాటులో వుంచాలనారు. వివిధ నిర్మాణాల గురించి సమీక్షించారు . సెప్టెంబర్ నుంచి మార్చ్ వరకు వచ్చే వివిధ ఉత్సవాలకు తగిన ప్రణాళికలు రూపొందిచాలని ఈ ఓ ఆదేశించారు. అందుకు పలు సూచనలు చేసారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.