శ్రీశైల దేవస్థానం:రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు 22 న వనమహోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ వనమహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఈ రోజు దేవస్థానములో మొక్కలు నాటారు.దేవస్థానం గోశాలకు సమీపాన వలయ రహదారికి ఇరువైపులా వనమహోత్సవ సందర్భంగా మొక్కలు నాటారు.ఈ రోజు రావి, జువ్వి, తెల్లమద్ది, కానుగ, నేరేడు,వేప, పొన్న మొదలైన మొక్కలు వలయ రహదారిలో నాటారు .ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు, క్షేత్రాన్ని మరింతగా సుందరీకరించేందుకు దేవస్థానములో విస్తృతంగా మొక్కలు నాటుతున్నట్లు చెప్పారు.ముఖ్యంగా వలయ రహదారికి (రింగురోడ్డు) ఇరువైపులా, దేవస్థానం ఉద్యానవనాలలోనూ ఆరుబయలు ప్రదేశాలలోనూ ఈ మొక్కలను నాటాలని సంకల్పించామని చెప్పారు.
వర్షాకాలం ముగిసేలోగా క్షేత్రపరిధిలో భారీగా మొక్కలను నాటేందుకు ఇప్పటికే ప్రణాళిక సిద్ధం అయింది. ఇందుకు పలు రకాల మొక్కలు కూడా సేకరించారు. అదేవిధంగా మొక్కలను సమకూర్చుకోవడములో అటవీశాఖ వారి సహకారాన్ని కూడా తీసుకుంటున్నారు.
ఈ కార్యక్రమములో దేవస్థానం హార్టికల్చరిస్ట్ లోకేష్, గోశాల వైద్యులు డా. నారాయణరెడ్డి, ఉద్యానవన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.