శ్రీశైల దేవస్థానం:శ్రీశైల దేవస్థానం వసతివిభాగంలో పనిచేస్తున్న కె.వి.డి.నగేష్ కుమార్ ( ఒప్పంద కార్మికుడు) 15.07.2020న అనారోగ్యంతో మరణించారు.
శ్రీశైల దేవస్థానం లో పనిచేస్తున్న ఒప్పంద, పొరుగు సేవల సిబ్బంది వారి నెలవారీ జీతం నుండి ఒకరోజు వేతనమొత్తం -రూ.1,83,092/-లు ఈ రోజు (02.12.2020) న కీ.శే. కె.వి.డి.నగేష్ కుమార్ కుటుంబానికి ఆర్థిక సహాయంగా అందజేశారు.
ఈ మేరకు సంబంధిత మొత్తపు చెక్కును కార్యనిర్వహణాధికారి చేతుల మీదుగా మరణించిన ఉద్యోగి భార్య శ్రీమతి పి. గౌతమీబాలకు చెక్కును అందించారు.
కార్యక్రమములో గోశాల విభాగపు పర్యవేక్షకురాలు శ్రీమతి కె. సాయికుమారి, పరిపాలనా విభాగపు పర్యవేక్షకులు శ్రీమతి పి. హిమబిందు, పలువురు ఒప్పంద, పొరుగు సేవల సిబ్బంది పాల్గొన్నారు.
*Sakshi Ganapathi Abhishekam performed in the temple today.
**Veerabhadraswamy Puuja performed in the temple.