*Kidambi Sethu raman*
Sri Ahobila math Paramparadheena
SrimadAdivan satagopa yatheendra mahadesika
Sri Lakshmi Narasimha swamy devasthanam
Ahobilam.
NAVA RAATHRI UTSAVAM
Ninth day 07.10.2019
MAHA NAVAMI
On the occasion of Navarathri festival, in the morning Vishesha thirumanjanam to Ahobila divya dampathis and
In the evening Unjal seva and irattai purappadu followed by sathumorai and gosti are celebrated.
శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం
అహోబిలం.
నవరాత్రి ఉత్సవం
తొమ్మిదవ రోజు 07.10.2019
మహా నవమి
శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో నవ రాత్రి ఉత్సవంలో తొమ్మిదవ రోజైన నేడు ఉదయం శ్రీ అహోబిల దివ్య దంపతులు శ్రీ అమృతవల్లి ప్రహ్లాదవరదులకు,శ్రీ ఆదివణ్ శఠగోప యతిశేఖరులకు నవకలశ పూర్వక పంచామృతాభిషేకం నిర్వహించారు. సాయంత్రం ఊంజల్ సేవ ,ఆలయం లోపల ఉత్సవం నిర్వహించారు. రాత్రి శాత్తుమొరై గోష్ఠి కార్యక్రమాలు జరిగాయి.
*శ్రీ అహోబిల దేవాలయ పరంపర ధర్మకర్త శ్రీ అహోబిల మఠం 46వ పీఠాధిపతి శ్రీ వణ్ శఠగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికుల వారు శ్రీ అహోబిల మహాక్షేత్రానికి వేంచేశారు.వారిని ఆలయ సంప్రదాయమును అనుసరించి సమస్త రాజ లాంఛనములతో,స్వామి వారి శ్రీ శఠారి తో పంచ ముద్రలు సమర్పించి గ్రామంలోకి ఆహ్వానించారు.అనంతరం ఆలయానికి విచ్చేసి శాత్తుమొరయిలో శ్రీ పీఠాధిపతి వారు పాల్గొన్నారు.
His holiness 46th peethadhipathi of Sri Ahobila math Sri van satagopa sri Ranganatha yatheendra mahadesikan ,the hereditary trustee to Ahobilam devasthanam arrived at Ahobilam.His holiness had received with all the royal honours as per the temple traditions.
His holiness also took part in Sathumorai