శ్రీ అత్తి వరదరాజ స్వామి శ్రీ చరణములకు ‘సేతు’ పుష్పం
*Kidambi Sethu raman*
నలభై ఏండ్ల తరువాత అనంత సరస్సు నుండి విచ్చేసి, మనలను అనుగ్రహిస్తున్న శ్రీ అత్తి వరదరాజ స్వామి వారి దివ్య శ్రీ చరణములకు నేను సమర్పిస్తున్న ఒక చిన్న పద పుష్పం…..
కొలువరో మీరెల్ల కైమోడ్పులర్పించి
వెలిసేనిదే కంచిలోన అత్తి వరదుడు
హోమ కుండాన యాగ ఫలమై బుట్టి
అమరులకెల్ల ఆరాధ్యదైవమై నిలిచి
తమకము దీర కొనేటిలో పడుకున్న
సామజగిరి మీది వాడీ అత్తి వరదుడు
శంకు చక్రములు ఇరు కరముల బట్టి
అంకెపు శ్రీ సతినురమున దాల్చి
అంకించు వారికి అతి సులభుడైయున్న
పంకజ పాదముల వాడీ అత్తివరదుడు
బంగారు చేలమును నయముగా గట్టి
సింగారముగా నలుబది ఏండ్లకు వచ్చి
చెంగట అహోబలాన ప్రహ్లాదవరదుడైయున్న
అంగడి దొరతనముల వాడీ అత్తి వరదుడు
I humbly offer a small pada pushpam to sri Athi varadar who came out of Anantha saras after forty years……
Meaning……
O devotees!!
Offer your prayers to him.
Here is Sri Athi varadar in kanchi.
He is the deity on Hasthi sailam who came out of homa kundam.He is the deity of all the devas(devaadhi rajan).In order to pacify his thaapam.
He is the god with lotus feest who is holding shanka and chakra in his two hands.
He bears sree sathi on his chest.
He is very sulabham to those who worship him.
He is my Prahladavarada in ahobilam who adorns golden robes and came out after 40 years.He is the Lord with many vaibhavams.
Athi varada
Prahladavarada
Sharanu sharanu sharanu
Post Comment