శిల్పారామం మరియు నాట్యసంగ్రహ సంయుక్తంగా నిర్వహించు ” ఇండియన్ డాన్స్ ఫెస్టివల్ హైదరాబాద్ 2016 ” రెండవ రోజు కూడా మహా అద్భుతంగా గరిగాయి.
ఈ రోజు కార్యక్రమంలో ఒడిస్సి నృత్య ప్రదర్శన మరియు కూచిపూడి యక్షగానం ప్రదర్శన ఎంతో ఆకట్టుకుంది. ప్రేక్షకులను అలరింప చేసాయి.
ఒడిశాకి చెందిన రుద్రాక్ష్య ఫౌండేషన్ వారి బృందంచే ” ఒడిస్సి యోగా డాన్స్ ” ప్రదర్శనను ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో తిలకించారు.
పసుమర్తి రత్తయ్య శర్మ మరియు వేదాంతం వెంకటాచలపతి బృందంచే కూచిపూడి యక్ష గాణం ” ప్రహ్లద చరిత్ర ” ఆధ్యంతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొంది.
ప్రముఖ నృత్య కళాకారిణి, సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత కి.శే. శ్రీమతి ఉమా రామారావు గారి గురించి Dr. అనుపమ కైలాష్ గారు తన నృత్య కళా జీవనం గురించి చాల చక్కగా వివరించారు. ఉమా రామారావు గారు మా అందరికి ఎంతో ఆదర్శం, ఆమె చేసిన కృషిని మరువలేమని, మాది గురు శిస్యులు మరియు తల్లి బిడ్డల ఆత్మీయత సంబంధంఅని, ఆమె చూపిన మార్గంలో నడిచి ఇంకా మర్రిన్ని మంచి కార్యక్రమాలు చేస్తామని ఆమెను స్మరించుకున్నారు.
రెండవ రోజు ఉత్సవాల ప్రదర్శనల అనంతరం నాట్యసంగ్రహ ప్రెసిడెంట్ శ్రీమతి Dr. యశోద ఠాకూర్ గారు కళాకారులందరిని సత్కరించారు.
ఈ రెండు రోజుల ప్రదర్శనలు నిర్వాహకులు చాల అద్భుతంగా నిర్వహించారు. ప్రేక్షకులు కూడా అత్యధిక సంఖ్య లో పాల్గొన్నారు. ఈ రెండు రోజుల కార్యక్రమానికి కృషిచేసిన అందరికి పేరు పేరున కృతఙ్ఞతలు నిర్వాహకులు తెలియచేసారు.