
తాడేపల్లి: విశాఖ నగరానికి తలమానికంగా రూపుదిద్దేలా పలు ప్రాజెక్టుల ప్రతిపాదనలపై ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి బొత్స సత్యనారాయణ, ఉన్నతాధికారులు హాజరయ్యారు. విశాఖ సముద్రతీరంలో 13.59 ఎకరాల్లో ప్రాజెక్టు ప్రతిపాదనలపై సీఎం వైయస్ జగన్ సమీక్షించారు. ఇదే భూమిని లూలూ గ్రూప్‌కు కారుచౌకగా 33 ఏళ్ల లీజుకు గత ప్రభుత్వం కట్టబెట్టిందని చెప్పారు. ప్రభుత్వానికి అధిక ఆదాయం వచ్చేలా విశాఖ నగరానికి తలమానికంగా రూపుదిద్దేలా పలు ప్రతిపాదనలపై అధికారులతో చర్చించారు. ఈ మేరకు ఎన్బీసీసీ, ఏపీఐఐసీ సీఎంకు వివరాలు అందించారు. కమర్షియల్ ప్లాజా, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మాణాల వల్ల కనీసం ప్రభుత్వానికి రూ.1450 కోట్ల నికర ఆదాయం వస్తుందని ఎన్బీసీసీ వెల్లడించింది.