కర్నూల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్తో ముగ్గురు రైతులు మృతి చెందారు. సంజామల మండలం మిక్కినేనిపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు రైతులు పొలంలో విద్యుత్ షాక్తో మృతి చెందారు. ఓ రైతు మోటార్ వేస్తుండగా కరెంటు తీగెలు తగిలి షాక్కు గురయ్యాడు. ఇది గమనించిన పక్క పొలంలో ఉన్న మరో ఇద్దరు రైతులు అక్కడకు చేరుకుని కాపాడే ప్రయత్నం చేయగా వారికి కూడా విద్యుత్ తీగెలు తగలడంతో షాక్కు గురై మొత్తం ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మిక్కిలినేనిపల్లి గ్రామస్తులేగాక చుట్టుపక్కల గ్రామాల వారు కూడా అక్కడకు చేరుకుని మృతదేహాలను చూసి విలవిలలాడారు. మరిన్ని వివరాలు రావలసిఉంది