వనపర్తి జిల్లాలో 120 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

*వనపర్తి పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో వనపర్తి ఆర్ జి గార్డెన్ ఫంక్షన్ హాల్ లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ పై ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో  రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి*

*అవసరానికి సరిపడా కొనుగోలుకేంద్రాలు

– 75 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం మార్కెట్ కు వస్తుందని అంచనా
– సాగు నీటిరాకతో భారీగా పెరిగిన ఆయకట్టు
– వనపర్తి జిల్లాలో 120 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
– మద్దతుధర పొందేందుకు రైతులు నాణ్యమైన సరుకును మార్కెట్ కు తీసుకురావాలి
– ఇతర రాష్ట్రాల నిండి మన మార్కెట్లకు ధాన్యం రాకుండా నిఘా పెట్టాలి
– కొనుగోలు కేంద్రాల ప్రతినిధులు, మిల్లర్లు తక్కువ తూకాలు, ఇతర అక్రమాలకు పాల్పడవద్దు
– కొనుగోలు కేంద్రాలలో అక్రమాలు జరిగినట్లు తేలితే వెంటనే కేంద్రం రద్దు, బాధ్యులపై చర్యలు
– ధాన్యం తేమ శాతంలో మార్పుకు అవకాశం ఉన్నందున  మిల్లర్లు, ఐకేపీ బృందాలు  ముందే పరిశీలించుకోవాలి
– దశలవారీగా ధాన్యం సేకరణ కొనసాగుతుంది
– జిల్లావ్యాప్తంగా హమాలీల ధరలు ఒకేలా ఉండేలా చూడాలి
– ధాన్యం రవాణా విషయంలో అధికారులు సమన్వయం చేసుకోవాలి
– ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాలుకు 18 35 రూపాయలు, సాధారణ రకానికి 1815 రూపాయలను మద్దతు ధరగా నిర్ణయించినట్లు వెల్లడి
– ఐకేపీ బృందాలకు క్రితంసారి ధాన్యం కొనుగోలుకు సంబంధించి కోటి ముప్పై ఆరు లక్షల 17 వేల 825 రూపాయల చెక్కు అందజేత
– వరి ధాన్యం కొనుగోలు పై రూపొందించిన గోడ పత్రిక ఆవిష్కరణ

print

Post Comment

You May Have Missed