రాష్ట్రంలో కొత్తగా ఖమ్మం పోలీస్ కమీషనరేట్ ప్రారంభించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ ఆదివారం క్యాంపు కార్యాలయంలో సిఎంను కలిసి ఖమ్మం లో పోలీస్ కమిషనరేట్ ప్రారంభించాలని అభ్యర్థించారు. దీనిపై ముఖ్యమంత్రి డీజీపీ అనురాగ్ శర్మతో మాట్లాడారు. ఖమ్మం పోలీస్ కమిషనరేట్ కోసం ప్రతిపాదనలు తయారు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో తెలంగాణలో పోలీస్ కమిషనరేట్ల సంఖ్య 9కి చేరినట్లయింది.