తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ వారి ఆద్వర్యంలో “బతుకమ్మ ఫిల్మోత్సవం -2”. నిన్నటి నుంచి రవీంద్రభారతి, పైడి జయరాజ్ సమావేశమందిరంలో (మొదటి అంతస్తు) 5 రోజులపాటు సాయంత్రం 6 గంటలకు నిర్వహిస్తున్నారు.
గత సంవత్సరంలాగానే ఈ యేడాది కూడా “బతుకమ్మ ఫిల్మోత్సవం” రవీంద్రభారతి సమావేశమందిరంలో నిన్నటి నుంచి ప్రారంభించారు. మొదటి రోజు తెలంగాణ రాష్ట్రం గర్వించ దగ్గ తెలంగాణ దర్శక దిగ్గజం శ్రీ బి.నర్సింగ్‌రావు గారి దర్శకత్వంలో’ రూపొందిన “మట్టిమనుషులు చిత్రం” ప్రదర్శన చేయగా…
ఈ రోజు శ్రీ అక్షర కుమార్ తీసిన “కాకి పడిగెల కథ డాక్యుమెంటరీ” మరియు శ్రీ శివ.ఐ దర్శకత్వంలో రూపొందిన “సాధనాశూరులు డాక్యుమెంటరీ” చిత్ర ప్రదర్శన చేశారు.
డాక్యుమెంటరీ చేయడం వల్ల రెండు ప్రయోజనాలుంటాయి. ఒకటి వర్తమాన సమాజంలో మన చుట్టూ ఉన్న మరో ప్రపంచాన్ని పరిచయం చేయడం ద్వారా ఆలోచన రేకిత్తించడం.
మరొకటి భవిష్యత్ తరాలకు ఒక కళారూపం యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం.
నిజామాబాద్ జిల్లా కామారెడ్డి ప్రాంతంనకు చెందిన శివ.ఐ.
శ్రీ శివ.ఐ తీసిన సాధనా శూరులు అను వీరు కరీంనగర జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామంలో నివసిస్తారు.క్రీ.శ. 234 సంIIలోవీరి పూర్వీకులు కృష్ణ గంధర్వ రాజు యొక్క ఆకృత్యాలను సహించలేక కాళికాదేవి దీక్షతో కొన్ని అదృశ్య శక్తులు మరియు ఇంద్రజాల శక్తులను పొంది రాజుని సంహరించారు. అందుకు వీరు సాధనాశూరులుగా నామకరణం చెందారు. నాటి నుంచి నేటి వరకు కళకు జీవం పోస్తూ, వీరు జీవనం కొనసాగిస్తున్నారు కాల క్రమేణా వీరికి సరైన ఆధరణ లేక కళనే నమ్ముకొని జీవించలేక ఆ కళ అంతరించిపోయే దశలో ఉంది.
వీరు గ్రామాల్లో ప్రదర్శనలను చేస్తూ ప్రజలిచ్చే విరాళాలతో జీవనం కొనసాగిస్తున్నారు. ఈ డాక్యుమెంటరీ ని తొలిసారిగా తీసిన శివ ఐ ఆ కళాకారుల కళనీ తెలంగాణ ప్రభుత్వం, బాషా సాంస్కృతిక శాఖ ఆద్వర్యంలో బయటకు తీసుకువచ్చాడు. అంతరించిపోతున్న కళలను బాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ ప్రభుత్వం యువ దర్శకులను ప్రోత్సహిస్తుంది.
కరీంనగర్ జిల్లా గోదావరిఖని ప్రాంతంనకు చెందిన అక్షరకుమార్.
శ్రీ అక్షర కుమార్ తీసిన “కాకి పడిగెల కథ డాక్యుమెంటరీ” ముదిరాజుల మిరాశి కులం కాకిపడిగెల. వీరు ఎక్కువగా కరీంనగర్, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో నివాసముంటారు. వారికి వారసత్వంగా వస్తున్న ఈ కళారూపం కాకిపడిగెల కథతోనే వీరి బతుకు వెళ్లదీస్తున్నారు. పటమేసి పాండవుల కథ చెప్పే సంప్రదాయం వీరిది. చెట్టుకొకరు పుట్టకొకరుగా ఉన్న ఈ కులస్తుల కుటుంబాలు ఓటి ఒరుగల్లులో ఉంటే మరోటి సిద్ధిపేట పరిసర గ్రామాల్లో ఉంది. వందల యేండ్లుగా కాకిపడిగెలు కథ చెప్పుకుంటూ బతుకీడుస్తున్నారు.
ఇలాంటి వారి గురించి ఆలోచించిన అక్షర కుమర్ ఎడతెగని మమకారంతో, వారి కళ పట్ల ఉన్న గౌరవంతో, వారి కళారూపాన్ని, వారి కళ చరిత్రను బతికించాలనే తండ్లాటతో రూపొందించాడు ఈ కాకిపడిగెల కథ. ఓ అంతరిస్తున్న కళ గురించి, కళాకారుల గురించి ఈ యువ దర్శకుడు మధనపడింది ఏంటో.. ఈ యువదర్శకుని ప్రతిభ ఇందులో అడుగడుగునా కనిపిస్తుంది. కనుమరుగవుతున్న కళారూపానికి కన్నీటి భాష్యం, కాకిపడిగెల సజీవ దృశ్యకావ్యం. ‘‘కళ బతకాలంటే…ముందు కళాకారుడు బతకాలి’’.
కార్యక్రమంలో ప్రముఖ హాస్య నటుడు కరీంనగర్ జిల్లా గోదావరిఖని ప్రాంతానికి చెందిన తాగుబోతు రమేశ్ (ఎన్నో చిత్రాల్లో నటించారు), దర్శకులు సాగర్ చంద్ర ( అయ్యారే చిత్రం తీశారు, అప్పట్లో ఒకడు ఉండేవాడు చిత్రం తీస్తున్నారు ప్రస్తుతం), కందికొండ తెలుగు సినిమా పాటల రచయిత (మళ్ళీ కూయవే గువ్వా- ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, చూపులతో గుచ్చి చంపాకే-ఇడియట్ చిత్రం, గల గల పారుతున్న గోదారిలా – పోకిరి చిత్రం, V6 బతుకమ్మ పాటలు- ఇలా 1200 పాటలు రాశారు), దర్శకులు శ్రీ రాజ్ మాదిరాజు (చిరుజల్లు, ఋషి, ఆంద్రపోరి, ఐతే 2.0 తదితర చిత్రాలకు దర్శకులు), డాII పసునూరి రవీందర్ – కేంద్ర యువ సాహితీవేత్త పురస్కార గ్రహీత, వరంగల్ వ్యక్తి, తెలంగాణ జానపద పాటల పై Ph. D చేసిన తొలి తెలంగాణ వ్యక్తి. సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ మామిడి హరికృష్ణ, తెలంగాణ సినీ నటుడు రోషన్ బాలు, ఈ కార్యక్రమ సమన్వయకర్త నాగులూరి నరేందర్, అక్షర కుమార్, సంఘీర్, శివ.ఐ, ఈ కార్యక్రమంలో పలువురు సినిమా అభిమానులు, ప్రేమికులు, యువ దర్శకులు, తదితరులు పాల్గొన్నారు.
రేపటి కార్యక్రమాల వివరాలు:-
1) రవీంద్రభారతి, పైడి జయరాజ్ సమావేశమందిరంలో (మొదటి అంతస్తులో) “ఫిల్మోత్సవం –2” లో భాగంగా శ్రీ అజిత్ నాగ్ దర్శకత్వంలో రూపొందిన “బొమ్మలోల్లు” మరియు శ్రీ కె వి ఆర్ మహేంద్ర దర్శకత్వంలో తీసిన “ఒగ్గుచుక్క” డాక్యుమెంటరీల ప్రదర్శన ఉంటుంది.
2) రవీంధ్రభారతి, ప్రధాన వేధికలో ఉదయం 10గంIIలకు “కొత్తపేట జిల్లాపరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు” ప్రదర్శన ఉంటుంది.