శ్రీశైలం శివరాత్రి బ్రహ్మోత్సవాలలో గురువారం శివదీక్ష శిబిరాల వద్ద వేదికపై శివలీలలు నాటకం ప్రదర్శించారు . తెలంగాణ రాష్త్రం ఖమ్మం జిల్లా కు చెందిన జే.భానుప్రకాష్ ఈ నాటకాన్ని సమర్పించారు . బృందంలో అందరూ నట కౌశలాన్ని ప్రదర్శించి నాటకాన్ని రక్తికట్టించారు .