ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఎన్.డి.ఆర్.ఎఫ్., సైనిక దళాలను రాష్ట్ర అధికారులు సిద్ధం చేశారు. 60 మందితో కూడిన ఎన్.డి.ఆర్.ఎఫ్. బృందం హైదరాబాద్ లో సిద్ధంగా ఉంది. సైనికులు కూడా సహాయక చర్యలు అందించేందుకు సిద్దంగా ఉన్నారు. అవసరాన్ని బట్టి వారి సేవలు వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.