పిసిసి పిలుపు మేరకు మచిలీపట్నంలో స్ధానిక లక్ష్మీ టాకీస్ సెంటర్ లో ఆదివారం పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. కర్ణాటకలో ప్రజాస్వామ్యం గెలిచింది, లౌకిక వాదం గెలిచింది, మతోన్మాదం ఓడింది,సుప్రీం కోర్టు తీర్పు బీజేపీ కి చెంపపెట్టు అని పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఆనందం వ్యక్తం చేసింది .తొలుత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అబ్దుల్ మతీన్, పిసిసి సభ్యులు యండి దాదా సాహెబ్, జిల్లా అధికార ప్రతినిధి బుల్లెట్ ధర్మారావు, మహిళా అధ్యక్షురాలు నల్లబోలు కుమారి, జిల్లా ఎస్ సీ సెల్ చైర్మన్ ఆవుల ప్రవీణ్, జిల్లా ఉపాధ్యక్షులు పెదపూడి దిలీప్, యండి ఇషాఖ్, నాగరాజు, కల్లు వెంకటేశ్వరరావు, దత్తుడు, ఈవన మణిబాబు, శాంతి రాజు, కోటేశ్వరరావు, సాంబశివరావు, అమ్మాజీ, జోగి అంజయ్య, హైదర్, ఖదీర్, తదితర సీనియర్ నాయకులు పాల్గొని బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు . కాంగ్రెస్ వారు చాలా ఉత్సాహంగా ఉన్నారు .