బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు కృష్ణజింకల కేసులో విముక్తి లభించింది. రాజస్థాన్‌లో కృష్ణ జింకలను వేటాడి హతమార్చాడన్న కేసులో ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ రాజస్థాన్ హైకోర్టు సోమవారం తీర్పు ఇచ్చింది.17 ఏండ్ల క్రితం అక్రమ ఆయుధాలతో కృష్ణజింకలను వేటాడినట్టు జోధ్‌పూర్‌లో నమోదైన కేసులపై ట్రయల్ కోర్టు వెల్లడించిన తీర్పులను సవాల్ చేస్తూ సల్మాన్ చేసిన అభ్యర్థనలను స్వీకరించిన రాజస్థాన్ హైకోర్టు ఈ రెండు కేసుల్లోనూ ఆయనను నిర్దోషిగా తేల్చింది.