ప్రదర్శనశాల మరింత కళాత్మకంగా ఉండేందుకు చర్యలు అవసరం-ఈ ఓ
శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానం లో ప్రదర్శనశాల మరింత కళాత్మకంగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని దేవస్థానం ఈ ఓ ఆదేశించారు. అభివృద్ధి పనుల పరిశీలనలో భాగంగా ఈ రోజు కార్యనిర్వహణాధికారి యాంఫీథియేటర్ (ప్రదర్శనశాల) పనులను పరిశీలించారు.భారత ప్రభుత్వపు “ప్రసాద్” (PRASAD – Pilgrimage_Rejuvenation And Spiritual Augmentation Drive ) పథకం కింద గోశాల సమీపములో (వలయ రహదారి ప్రక్కలో) ఈ ప్రదర్శనశాల నిర్మితమవ్తోంది.ఇప్పటికే దాదాపు 80శాతానికి పైగా ఈ నిర్మాణపు పనులు పూర్తయ్యాయి. కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ వీలైనంత త్వరితగతిన మిగిలిన పనులు పూర్తి చేసి నిర్మాణాన్ని వినియోగములోకి తెచ్చేందుకు తగు చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా ప్రదర్శనశాల మరింత కళాత్మకంగా ఉండేందుకు తగు చర్యలు చేపట్టాలన్నారు. యాంఫీథియేటర్ వద్ద ఆకర్షణీయమైన విద్ద్యుద్దీకరణ పనులు చేపట్టాలన్నారు. ఈ పరిశీలనలో దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మురళీ బాలకృష్ణ, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ శ్రీనివాసరెడ్డి తదితర ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రసాద్ పథకం కింద లైట్ అండ్ సౌండ్ షో, ఆలయంలో ఇత్తడి క్యూలైన్ల ఏర్పాట్లు, బస్టాండ్ సమీపంలో విశాలమైన పార్కింగ్ ప్రదేశ ఏర్పాటు, వలయ రహదారి వద్ద పార్కింగ్ ప్రదేశ ఏర్పాటు, ట్రంలో పలుచోట్ల శౌచాలయాల నిర్మాణం, కర్ణాటక ప్రభుత్వ అతిథిగృహం వద్ద టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్ నిర్మాణం, శిఖరం వద్ద టూరిస్ట్ అమినిటీస్ సెంటర్ నిర్మాణం, శిఖరేశ్వరం వద్దనే వాటవర్ నిర్మాణం, శిఖరేశ్వర ఆలయం వద్దగల పురాతన పుష్కరిణి జీర్ణోద్ధరణ పనులు మొదలైనవి చేపట్టారు.
- Bayalu Veerabhadraswamy puja, Kumaaraswaamy puja, Pallaki seva,Nandheeshwara puja,,Uyalaseva performed in the temple.
Post Comment