పంచమఠాల పునర్నిర్మాణం చక్కగా జరగాలని శ్రీశైల దేవస్థానం ఈ ఓ కే ఎస్ రామా రావు ఆదేశించారు. ఈ ఓ ఈ రోజు పలువురు అధికారులతో కలసి పలు మఠాల ను సందర్శించి పరిశీలించారని దేవస్థానం ఎడిటర్ తెలిపారు. ఈ మఠాల పునర్నిర్మాణం పనులను దేవస్థానం చేపట్టింది. కాగా ల్యాండ్ స్కేపింగ్, కాలిబాట రహదారులు , ఆకర్షణీయమైన విద్యుద్ధీకరణ పనులను కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ ( Pilgrimage Rejuvenation and Spiritual Augmentation Drive) పథకం కింద చేపడుతున్నారు. విభూతి మఠ, రుద్రాక్ష మఠ పనులు దాదాపు 80 శాతం పూర్తి అయ్యాయి. ఘంటా మఠ పనులు దాదాపు 50 శాతం పూర్తి అయ్యాయి.
భీమశంకర మఠానికి తగు మరమ్మతులు చేస్తారు. ఆపై ప్రసాద్ పథకం కింద పనులు చేస్తారు. ప్రాచీన నిర్మాణ శైలికి విఘాతం కలగకుండా , నాణ్యంగా వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని ఈ ఓ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ పనులు కాగానే చుట్టూ ప్రాకారం నిర్మించే ప్రణాళిక చేయాలని ఆదేశించారు. భక్తులు అన్ని మఠాలను ఒకే వరుసగా దర్శించుకోడానికి వీలుగా ఏక రహదారిని నిర్మించే అంశాన్ని పరిశీలించి ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. విభూతి మఠ ముందున్న ప్రాచీన మెట్ల మార్గాన్ని పునరుద్ధరించాలన్నారు. పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ ఈ, బీ ఈశ్వరయ్య , సంస్థ అధికారులు, దేవస్థానం ఈ ఈ- డీ వీ భాస్కర్ , దేవస్థానం డీ ఈ ఈ -శ్రీనివాస రెడ్డి, శ్రీశైలప్రభ ఎడిటర్ డా. సి. అనిల్ కుమార్, సహాయ స్థపతి జవహర్ , కాంట్రాక్టర్ మధుసూదన్ రెడ్డి తదితరులు ఈ ఓ వెంట ఉన్నారు.