కర్నూలు జిల్లాలో కోవిడ్ కేసుల వ్యాప్తి కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన మేరకు కళ్యాణ మండపాల వారు, హోటళ్ల ఫంక్షన్ హాల్స్ వాళ్లు పెళ్ళిళ్లకు 20 మందిని మాత్రమే అనుమతించాలని , లేదంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం కేసులు పెట్టి సీజ్ చేస్తాం అని జిల్లా ఇంఛార్జి కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి హెచ్చరించారు.
కల్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లలో జరిగే పెళ్లిళ్లకు స్థానిక రెవెన్యూ అధికారులతో అనుమతి తీసుకుని, నిబంధనలకు విరుద్ధంగా 20 మంది కంటే ఎక్కువగా హాజరును అనుమతిస్తే ఫంక్షన్ హాల్స్ ఓనర్స్ పై కేసులు పెట్టడం, సీజ్ చేయడంతో పాటు సంబంధిత అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని ఇంఛార్జి కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి స్పష్టంచేశారు.
జిల్లాలో పెళ్లిళ్ల నిర్వాహకులు/ప్రజలు కూడా కోవిడ్ నిబంధనలను అర్థం చేసుకుని, కోవిడ్ నిబంధనలను తప్పక పాటించి 20 మందిని మాత్రమే పెళ్ళిళ్ళకు ఆహ్వానించాలి..ఎక్కువ మంది హాజరు కావడం వల్ల నవ వధువులు కూడా కరోనా బారిన పడిన సంఘటనలు మీడియాలో చూస్తున్నాము..అందువల్ల పెళ్లిళ్ల నిర్వాహకులు కోవిడ్ నిబంధనలను పాటించి..20 మంది అతిథులనే పిలుచుకోవాలి..మాస్క్ తప్పని సరిగా అందరూ ధరించాలి..సేఫ్ డిస్టెన్స్ ను పారించాలి..చేతులను తరచూ శానిటైజ్ చేసుకోవాలి..కోవిడ్ వ్యాప్తి కట్టడికి సహకరించాలని ఇంఛార్జి కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి కోరారు.