శ్రీశైల దేవస్థానం:లోక కల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు 27 న ఆలయప్రాంగణంలోని నందీశ్వరస్వామి (శనగల బసవన్న స్వామి) కి విశేషార్చనలు జరిపింది.
ప్రతి మంగళవారం, త్రయోదశి రోజున దేవస్థానసేవగా (సర్కారీ సేవగా) ఈ కైంకర్యం ఉంటుంది. ప్రదోషకాలంలో సాయంసంధ్యాసమయంలో ఈ విశేష పూజలు నిర్వహించారు. ఈ విశేషార్చనలో ముందుగా అర్చకస్వాములు, వేదపండితులు సంకల్పాన్ని చెప్పారు.అనంతరం కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతిపూజను జరిపారు.ఆ తరువాత నందీశ్వరస్వామికి పంచామృతాలతోనూ, ద్రాక్ష, బత్తాయి, అరటి మొదలైన ఫలోదకాలతో హరిద్రోదకం, కుంకుమోదకం, గంధోదకం, భస్మోదకం, రుద్రాక్షోదకం, బిల్వోదకం, పుష్పోదకం, సువర్లోదకం, మల్లికాగుండంలోని శుద్ధజలంతో అభిషేకం నిర్వహించారు. తరువాత నందీశ్వరస్వామికి అన్నాభిషేకం జరిపారు.
పురుష సూక్తం, వృషభసూక్తం మొదలైన వేదమంత్రాలతో విశేషాభిషేకాన్ని చేసారు. తరువాత నందీశ్వరస్వామివారికి నూతనవస్త్ర సమర్పణ, విశేష పుష్పార్చనలను చేసారు. తరువాత నానబెట్టిన శనగలను నందీశ్వరస్వామికి సమర్పించారు. చివరగా స్వామికి నివేదన చేసారు.
*Special puja performed to Bayalu Veerabhadra Swamy today with traditions.