త్రిశక్తి శ్రీ శారదాపీఠం , సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం ధర్మపురం గ్రామస్తులు , పలువురు ఆధ్యాత్మిక చింతనా పరుల సంయుక్త కృషి ఫలితంగా ధర్మపురం సూర్య పంచాయతన దేవాలయ శంకుస్థాపన జరిగింది . జులై ఏడో తేదీన ఈ ఘన కార్యక్రమం తో పాటు కోటి లింగ ప్రతిష్ఠల మహోత్సవం జరిగింది .గణేష్ విద్యానంద పీఠం అధిపతి గణేష్ విద్యానంద భారతి స్వామి మంగళాశాసనములతో ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం ఘనంగా జరిగింది . గణపతి హోమం , నవగ్రహ హోమం , వాస్తు హోమం , రుద్ర హోమం ,చండీ హోమం ,ఆదిత్య హోమం పూజల సయుక్తంగా దేవాలయ శంకుస్థాపన జరిగింది . మహాపుర్ణాహుతి అనంతరం అభినందన కోలాహలం కనిపించింది . దేవాలయానికి మంచి రోడ్డు మార్గం , చక్కని విద్యుత్ సరఫరా పనులు ప్రజాప్రతినిధుల సహకారంతో జరగాలని గ్రామస్తులు కోరారు .