శ్రీశైలం క్షేత్రాన్ని త్రిముఖ వ్యూహంతో అభివృద్ధి చేస్తున్నట్లు దేవస్థానం ఈఓ భరత్ ప్రకటించారు . ఈ క్షేత్రాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని ఆయన తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్బంగా ఈఓ ,జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం తమ ప్రసంగంలో దేవస్థానం ప్రగతిని వివరించారు .దేవస్థానం పరిపాలన కార్యాలయ భవనం ప్రాంగణంలో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం జరిగింది .ముందుగా ఆలయ సంప్రదాయంగా మహా గణపతి పూజ జరిపారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల సమర్పించారు . ఆలయ రక్షణ సిబ్బంది , స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు . హోమ్గార్డ్స్ సిబ్బంది పతాక వందనం చేసారు. పతాక ఆవిష్కరణ అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. దేశభక్తి గేయాలు పాడారు. వసతి, ఆర్జిత సేవ టికెట్లను ముందుగానే ఆన్లైన్ ద్వారా పొందే అవకాశం కల్పించామన్నారు . సర్వదర్శనానికి ఫోటో మెట్రిక్ విధానాన్ని ప్రవేశ పెట్టామన్నారు . స్వచ్ఛశ్రీశైలం గురించి తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు .
ముగ్గుల పోటీ విజేతలు
మకర సంక్రాంతి ముగ్గుల పోటీలలో విజేతలకు బహుమతులు అందించారు .అపర్ణ . టి.సుబ్బమ్మ ప్రథమ బహుమతులను , సుధాసౌధామిని , అనుష ద్వితీయ బహుమతులు , కీర్తిబాయ్ , లక్ష్మి తృతీయ బహుమతులు , ఆర్గనైజింగ్ బహుమతి కోమలి అందుకున్నారు .