తెలంగాణ శాసనసభ, శాసనమండలి ప్రత్యేక సమావేశాల నిర్వహణపై సమీక్ష

రేపటి నుంచి  రెండు రోజులు జరిగే తెలంగాణ శాసనసభ, శాసనమండలి ప్రత్యేక సమావేశాల పై రాష్ట్ర శాసనసభ సభాపతి  పోచారం శ్రీనివాస రెడ్డి పోలీసు శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈరోజు శాసనసభ లోని స్పీకర్ చాంబర్ లో నిర్వహించిన ఈ ప్రత్యేక సమావేశంలో శాసనసభ నిర్వహణకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగినంత మంది పోలీసు శాఖ సిబ్బందిని నియమించాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణతో  పాటు శాసనసభ పరిసరాలలో వాహనదారులకు, సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగు ఏర్పాట్లు చేయాలని స్పీకర్ సూచించారు. పోలీసు శాఖ తరుపున తీసుకుంటున్న చర్యలను ఆ శాఖ ఉన్నతాధికారులు వివరించారు.

శాసనమండలి డిప్యూటీ చైర్మన్  నేతి విద్యాసాగర్, శాసనసభ డిప్యూటీ చైర్మన్ టి. పద్మారావు గౌడ్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి  వేముల ప్రశాంత్ రెడ్డి, శాసనసభ కార్యదర్శి డా. నరసింహా చార్యులు, హోం శాఖ  ప్రిన్సిపల్ సెక్రెటరీ రాజీవ్ త్రివేది, డీజీపీ  మహేందర్ రెడ్డి, హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

print

Post Comment

You May Have Missed