తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న జిల్లాలకు సంబంధించి డ్రాఫ్టు నోటిఫికేషన్ మీద చర్చించేందుకు ఆల్ పార్టీ మీటింగ్ కు ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ రావు ఆమోదం
తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న జిల్లాలకు సంబంధించి డ్రాఫ్టు నోటిఫికేషన్ మీద చర్చించేందుకు ఆల్ పార్టీ మీటింగ్ కు ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ రావు ఆమోదం
తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న జిల్లాలకు సంబంధించి డ్రాఫ్టు నోటిఫికేషన్ మీద చర్చించేందుకు ఆల్ పార్టీ మీటింగ్ కు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆమోదం తెలిపారు. మంగళవారం తన అధికారిక నివాసంలో ఈ మేరకు మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, సిఎంవో అధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, స్మితా సభర్వాల్, శాంతి కుమారి, రాజశేఖర్ రెడ్డి తదితరులతో సమీక్ష జరిపారు.
అగస్టు 20వ తేదీ (శనివారం) మధ్యాహ్నం రెండు గంటలకు ఆల్ పార్టీ మీటింగును నిర్వహించాల్సిందిగా సిఎం అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు టిఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం, బిజెపీ, సిపిఐ, సిపిఎం, టిడిపి పార్టీలకు ఆహ్వానాలు అందనున్నాయి. ప్రతి పార్టీ నుంచి ఇద్దరు ప్రతినిధులను ఆహ్వానించనున్నారు.
ఆల్ పార్టీ మీటింగులో పైన తెలిపిన పార్టీ ప్రతినిధులతో పాటు సిఎం కెసిఆర్, జిల్లాల ఏర్పాటు ప్రక్రియ మీద ఇప్పటికే కసరత్తు చేస్తున్న క్యాబినెట్ సబ్ కమిటి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సిసిఎల్ఏ తో పాటు సంబంధిత అధికారులు పాల్గొంటారు. అదే రోజు (అగస్టు 20) సాయంత్రం 4.30 నిమిషాలకు క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు సిఎం తెలిపారు.