తెలంగాణ రాష్ట్రం కొత్తది చిన్నదే అయిన దేశానికే ఆదర్శవంతమైన నిర్ణయాలు తీసుకుంటోందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ లో పేదరికాన్ని నిర్మూలించడానికి, విద్యను పెంపొందించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. తెలంగాణ చైల్డ్ ఫ్రెండ్లీ స్టేట్ అని ప్రకటించారు. ఇది ఒక చారిత్రాత్మక సందర్భం అని నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యర్ది అన్నారు. ఇన్ని వేలమంది విద్యార్థులు ఫ్రెండ్లీ స్టేట్ కోసం ఇక్కడికి రావడం ప్రపంచంలోనే అద్భుతం అన్నారు. కరీంనగర్ లోని అంబెడ్కర్ స్టేడియంలో జరిగిన బాలమిత్ర సదస్సుకు హాజరైన నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్. ఎంపీ వినోద్ కుమార్ చొరవ తీసుకొని ఏర్పాటు చేరిన ఈసదస్సుకు 50 వేలమంది విద్యార్థులు హాజరయ్యారు.
ఇలాంటి కార్యక్రమాలకు ఇంత శ్రద్ధతో స్పందించిన తెలంగాణ నేతలు రాజకీయనేతలు కాదు స్టేట్స్మెన్ అని కొనియాడారు. కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ లాంటి కార్యక్రమాలవల్ల తెలంగాణలో బాల్యవివాహాలు తగ్గాయని సత్యర్ది చెప్పారు. ఈ కార్యక్రమాలు చేపట్టినందుకు సీఎం కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపడుతున్న తెలంగాణ వైపు దేశం చూస్తుందని అన్నారు. చైల్డ్ ఫ్రెండ్లీ స్టేట్ ద్వారా తెలంగాణ కొత్త నాగరికతకు తెరలేపిందని సత్యర్ది అన్నారు.
అంతకు ముందు మంత్రి ఈటల మాట్లాడుతూ “పిల్లలు దేవులు చల్లనివారు కల్లకపటమెరుగని కరుణామయులు అనే గొప్ప భావన ఉన్న సీఎం కేసీఆర్ గారు అని అన్నారు. కైలాష్ సత్యర్ది, అబ్దుల్ కలాం లాంటి వారు పిల్లలను అమితంగా ప్రేమించేవారని. దేశం బాగుపడాలంటే అది పిల్లల చేతిలోనే ఉంది అని కలాం గారు అనేవారు.. వారి ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ గారి నాయకత్వం లో పనిచేస్తున్నామన్నారు. పిల్లలు హంసలు.. మంచిని మాత్రమే స్వీకరించి, చెడును వదిలివేయడం నేర్చుకోండి. విద్యార్థులరా మీరు మీ అమ్మ నాన్న ఆస్థి మాత్రమే కాదు తెలంగాణ ఆస్థి, మీ చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉంది. అమ్మ నాన్న లేని పిల్లలకు , ఆలనా పాలనా లేని పిల్లలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే అమ్మ నాన్న అని ఈటల అన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత మంచిదో అంత చెడ్డది కూడా..సెల్ ఫోన్ మీ మిత్రుడు అదే శత్రువు కూడా..పిల్లలు బలహీనతలతో పక్కదోవ పట్టొద్దు. యూట్యూబ్ లలో ఎన్నో వినకూడనివి, చూడకూడనివి ఉన్నాయి. అశ్లీల చిత్రాలు పిల్లలపై ప్రభావం చూపుతున్నాయి. వాటికి పిల్లలు దూరంగా ఉండాలి. చిన్న పిల్లలు కూడా ఈ సమాజంలో అబ్యూస్ కి గురి అవుతున్నారు.