తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చీకట్లను పారద్రోలి వెలుగులు నింపే దీపావళి తెలంగాణ ప్రజల జీవితాల్లో కూడా వెలుగులు నింపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలంతా సంతోషంగా పండుగ చేసుకోవాలని, వెలుగు జిలుగుల తెలంగాణను దీవించాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు సిఎం చెప్పారు.