తూమణి మాడత్తుచ్చుట్రుమ్ విళక్కెరియ
ధూపమ్ కమళ త్తుయిలణై మేల్ కణ్ వళరుమ్
మామాన్ మగళే ! మణిక్కదవమ్ తాళ్ తిరవాయ్
మామీర్! అవళై యెళుప్పీరో ఉన్ మగళ్ దాన్
ఊమైయో ? అన్రిచ్చెవిడో ? అనన్దలో
ఏ మప్పెరున్దుయిల్ మన్దిరప్పట్టాళో ?
మామాయన్ మాధవన్ వైకున్దన్ ఎన్రెన్రు
నామమ్ పలవుమ్ నవిన్రేలో రెమ్బావాయ్.
* శ్రీ కృషునితో సంబంధం గలిగిన ఒక గోపికను ఆండాళ్ ఈ పాశురంలో నిద్ర లేపుతున్నది.
చక్కటి మణులతో చేయబడిన గృహమునందు దీపములు ప్రకాశవంతముగా వెలుగుతున్నాయి.ధూపములు అంతటా వ్యాపించి ఉన్నాయి.ఓ మామ కూతురా! మణులతో చేయబడిన ద్వారాములను తెరుచుకొని రావమ్మా.ఓ మేనత్త! నీ కూతురిని నిద్ర లేపమ్మ. నీ కూతురు ఏమైనా మూగదా? లేక చెవిటిదా?అలసిపోయినదా? లేక ఎవరైనా మంత్రం వేశారా? గొప్ప మాయలు చేసే మాధవుని ,వైకుంఠనాథుని గురించి ఎన్నో నామములు మేము పలుకుతున్నాం.త్వరగా లేచిరావమ్మా.
*ధ్వని- జ్ఞానధూపము అలుముకుని , అనుష్ఠాన బలంతో సర్వేశ్వరునే ఉపాయముగా, స్వీకరణతో ఉండే చరమ దశ . పరిపక్వ జ్ఞానము.