విశేషాలు: భాగవత కన్యకల వాన పాట
ఆళిమళైక్కణ్ణా ! ఒన్రు నీకై కరవేల్
ఆళియుళ్ పుక్కు ముగున్దు కొడార్తేరి
ఊళిముదల్వ నురువమ్పోల్ మెయికరుత్తు
పాళియందోళుడై పర్పనాబన్ కైయిల్
ఆళిపోళ్ మిన్ని, వలమ్బురి పోల్ నిన్రదిరిన్దు
తాళాదే శార్ జ్ఞ్గముదైత్త శరమళైపోల్
వాళవులగినిల్ పెయ్ దిడాయ్ నాంగళుమ్
మార్గళి నీరాడ మగిళిన్దేలో రెమ్బావాయ్
అర్థం:
సర్వలోక పాలకుడైన శ్రీమన్నారాయణుని
ఆజ్ఞాధారకుడైన మేఘదైవమా! నీవు శ్రీ హరి వలె నల్లగా ఉండి,ఆ దేవదేవుని ఇరుచేతులనున్న శంఖ చక్రముల వలె వెలుగొందుతున్నావు. సముద్రము నుండి నీటిని సంగ్రహించి,గంభీర గర్జన చేస్తూ, శ్రీ హరి శార్జ్ఞమనే విల్లు నుండి వచ్చే శర పరంపర వలె, ప్రపంచమంతా సంతోషముగా జీవించునట్లు వర్షము కురిపించు.అందువల్ల మేము ధనుర్మాస వ్రతమును ఆచరించుటకు చక్కగా స్నానమాచరించగలము.