16 వ పాశురము .
* ఆచార్య సంబంధం ఉన్న వారిని కలుపుకొని ఆచార్యుని ఆశ్రయించాలి.
నాయగనాయ్ నిన్ర నన్దగోపనుడైయ
కోయిల్ కాప్పానే ! కొడిత్తోన్రుమ్ తోరణ
వాశల్ కాప్పానే ! మణిక్కదవమ్ తాళ్ తిరవాయ్
ఆయర్ శిరుమియరోముక్కు అరై పరై
మాయన్ మణివణ్ణన్ నెన్నెలేవాయ్ నేర్ న్దాన్
తోయోమాయ్ వన్దోమ్ తుయిలెళప్పాడువాన్
వాయాల్ మున్నమున్నమ్ మాత్తాదే అమ్మా! నీ
నేశ నిలైక్కదవమ్ నీక్కేలో రెమ్బావాయ్.
* అర్థం;
అందరకి నాయకుడైన నందగోపుని భవనమును కాపాడు ద్వారాపాలకా! లోనికి విడువుము . తోరణములతో శోభిస్తున్న ద్వారమును కాపాడుతున్న ద్వారపాలకా! మణులచే అందముగా వున్న గడియలను తెరువుము . గోపబాలికలగు మాకు మాయావి అయిన మణివర్ణుడగు శ్రీ కృష్ణ పరమాత్మ “పఱ ” అను వాయిద్యము ను ఇచ్చెదనని నిన్న మాట ఇచ్చెను . మేము వేరొక ప్రయోజనము కాంక్షించి రాలేదు. పవిత్రమైన భావముతో వచ్చాము . శ్రీ కృష్ణుని మేల్కొల్పుటకు గానము చేయుటకు వచ్చినాము . స్వామీ!ద్వార రక్షక ముందుగా నీవు కాదనకు !. దగ్గరగా ప్రేమతో ఒకదానినిఒకటి చేరి బిగువుగా పట్టుకొని వున్న తలుపులను నీవే తెరచి మమ్ములను లోనకు పోనిమ్ము . అని భవనద్వార పాలకులను గోపికలు వేడుకొన్నారు.
* ధ్వని : ఆచార్య సంబంధం ఉన్న వారిని కలుపుకొని ఆచార్యుని ఆశ్రయించాలి.