నోట్రుచ్చువర్కమ్ పుహిగిన్రవమ్మనాయ్
మాట్రముమ్ తారారో వాశల్ తిరవాదార్
నాట్రత్తుళాయ్ ముడి నారాయణన్ నమ్మాల్
పోట్రప్పరైత్తరుమ్ పుణ్ణియనాల్,పణ్ణొరునాళ్,
కూట్రత్తిన్ వాయ్ విళన్ద కుమ్బకరుణనుమ్
తోట్రు మునక్కే పెరున్దుయిల్ తాన్ తన్దానో ?
ఆట్రవనన్దలుడై యా యరుంగలమే
ఈ పాశురం లో ఆండాళ్ అందరిముందే భగవదనుభవమును పొంది,నిద్రిస్తున్న గోపికను నిద్రలేపుతున్నది.
అర్థం: పరమనే పురుషార్థాన్ని అనుగ్రహించే సులభుడు–
మాకన్నా ముందుగానే భగవదనుభవమును పొంది సుఖించి నిదురపోతున్న ఓ తల్లి! నీవు తలుపు తీయకున్నా ఫరవాలేదు.మాటనైనా పలుకవా? సుగంధము గలిగిన తులసి మాలచే అలంకరించబడిన నారాయణుడు మా వంటి వారు స్తుతించినా పరమనే పురుషార్థాన్ని అనుగ్రహించే సులభుడు. అతడు ఒక నాడు కుంభకర్ణుని మృత్యువు నోటిలో పడవేయగా, ఆ కుంభకర్ణుడు నిద్రలో నీ చే ఓడించబడి,నీకు నిద్రను సొత్తుగా అందించినాడా ఏమి? ఇంకా నిద్రమత్తు వదలని ఓ తల్లి! మా అందరికి శిరోభూషణము వంటిదానా! నిద్రమత్తు వదులుకొని తలుపు తెరిచి నీ దర్శనం మాకు కలిగించు…