డబల్ బెడ్ రూమ్ ఇండ్లను ఆసక్తిగా పరిశీలించిన కేంద్ర బృందం
గజ్వేల్ నియోజకవర్గం లోని గజ్వేల్, ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామ మైన ఎర్రవెల్లి లో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లను గురువారం కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి అపరాజితా సారంగి,ఇతర కేంద్ర బృందం పరిశీలించారు. గజ్వేల్ సమీపంలోని సంగాపూర్ లో నిర్మిస్తున్న సుమారు 2 వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఐఏఎస్ అపరాజిత బృందం పరిశీలించింది. అనంతరం ఎర్రవల్లి గ్రామాన్ని అధికారులు సందర్షించారు. ఎంతో అందంగానే కాకుండా సకల సౌకర్యాలు న్న ఆ ఇండ్లను అధికారులు ఆసక్తిగా పరిశీలించారు. గ్రామస్తులతో , ఇండ్లలో నివాసం ఉంటున్న ప్రజలతో సరదాగా ముచ్చటించారు. వారి జీవన స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. గ్రామ సర్పంచ్ భాగ్య బాలరాజు వారికి గొల్లభామ చీరెలను బహుకరించారు. గొల్లభామ చీరె ప్రత్యేకతను అడిగి తెలుసుకున్నారు. ఎర్రవెల్లి ప్రత్యేకతను జిల్లా కలెక్టర్ అపరజిత సారంగి బృందానికి వివరించారు.
అనంతరం గ్రామంలోని కళ్యాణమ0డపాన్ని సందర్శించారు.. హాల్ కిచెన్ , డైనింగ్ హాల్, కట్టిన విధానాన్ని కలెక్టర్ వెంకట్రామ రెడ్డిని అడిగి తెలుసు కున్నారు. తెలంగాణ గ్రామీణ సంస్కృతికి అద్దం పట్టే విధంగా గీసిన చిత్రాలకు, హాల్ నిర్మించిన విధానాన్ని చూసి సంతోషం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కేంద్ర బృందం వెంట గజ్వేల్ డెవలప్ మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి హనుమంతరావు, గజ్వేల్ ఆర్డీఓ విజయేందర్ రెడ్డి,గజ్వేల్, జగదేవ్ పూర్ మండల తహశీల్దార్లు ,స్థానిక నాయకులున్నారు.
-చైతన్య , గజ్వేల్.
*ఎర్రవల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు,లబ్ధిదారుల జీవన స్థితి గతులపై కలెక్టర్ తో వాకబు చేస్తున్న కేంద్ర బృందం.
* ఎర్రవల్లిని సందర్షించిన కేంద్ర ప్రభుత్వ మహిళా ఐఏఎస్ అధికారుల బృందానికి అందమైన గొల్లభామ చీరెలను బహుకరిస్తున్న సర్పంచ్ భాగ్యాబాలరాజు.
*గజ్వేల్ లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలిస్తున్న కేంద్ర బృందం , పక్కన కలెక్టర్ వెంకట్రాం రెడ్డి.
*సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లతో పాటు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందానికి వివరిస్తున్న కలెక్టర్
*
Post Comment