చిన్నతరహా  పరిశ్రమ నిర్వహిస్తున్న  బందర్ యువకుడు 

*Mouli,Machilipatnam*

మచిలీపట్నం జవ్వారు పేట కు చెందిన ఎం.సాయినాధ్ గత సంవత్సరంగా తేనె,  సంబంధిత ఉత్పత్తులు మన ఊరులోనే తయారు చేస్తున్నారు.ఇటీవల మొదలుపెట్టిన ఆపితెరపి కి కూడా మంచి పేరు, ప్రోత్సాహం లభించిందని  ఎం.సాయినాధ్ తెలిపారు . ఆపితెరపి వల్ల దీర్ఘకాలిక మోకాళ్ళ నొప్పులు,నడుంనొప్పులతో బాధ పడుతున్నవారికి మంచి ఫలితాలు వస్తున్నాయని,  పలువురు ప్రశంసించారని చెప్పారు . దీనిని జాతీయ\ గ్రామీణ అభివృద్ధి సంస్థ,హైదరాబాద్ వారు గుర్తించి ఆహ్వానించారన్నారు .అందులో భాగంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారిని కలిసి తమ పరిశ్రమ  గురించి చెప్పగా  అభినందించి ప్రోత్సహించారన్నారు . మన ఊరులో శిక్షణ శిబిరాలను పెట్టి బోధించటానికి ఎం.సాయినాధ్ నడుం బిగించారు.ఆసక్తికలిగిన వారు శిక్షణ తరగతులు,  తేనె ఉత్పత్తులకు 8555869186 కు సంప్రదించవచ్చునని చెప్పారు.

print

Post Comment

You May Have Missed