జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ చమన్ గుండెపోటుతో మృతి చెందారు. మాజీ ఎమ్మెల్యే పరిటాల రవీంద్రకు ముఖ్య అనుచరుడుగా ఉండేవారు. 2004 లో కాంగ్రెసు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పటి ఫ్యాక్షన్ నేపథ్యంలో ఆయన దాదాపు ఎనిమిది సంవత్సరాలు అజ్ఞాతంలో ఉన్నారు. 2012 సంవత్సరంలో అజ్ఞాతం నుంచి బయటకు వచ్చారు. 2014 సంవత్సరంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రామగిరి మండలం నుంచి తెలుగు దేశం పార్టీ నుంచి జడ్పిటీసిగా గెలుపోంది జడ్పీ ఛైర్మన్ అయ్యారు. ముందుగా జరిగిన ఒప్పందం మేరకు రెండున్నర సంవత్సరాల తరువాత తన పదవికీ రాజీనామా చేశారు. సోమవారం మధ్యాహ్నం గుండెపోటుతో మృతి చెందారు. చమన్ మృతితో టిడిపిలో విషాద ఛాయలు నెలకొన్నాయి . మంత్రి పరిటాల సునీత తీవ్ర సంతాపం ప్రకటించారు . విషయం తెలియగానే అనంతపురం లోని సవీర ఆసుపత్రికి చేరుకొని పర్యవేక్షించారు .