ఘనఘనంగా శ్రీశైలం కార్తీక మాసోత్సవాల ఏర్పాట్లు పూర్తి-ఈ ఓ పర్యవేక్షణ

శ్రీశైల దేవస్థానం:కార్తికమాస మొదటి సోమవారం సందర్భంగా 16న సాయంకాలం ఆలయ పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం,  పుష్కరిణి హారతి కార్యక్రమాలు నిర్వహిస్తారు.కోవిడ్ నిబంధనల కారణంగా పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులను దీపోత్సవానికి అనుమతిస్తారు. దీపోత్సవంలో పాల్గొన దలచిన భక్తులు సాయంకాలం 5 గంటలలోగా శ్రీశైలప్రభ విభాగలో వారి పేర్లను నమోదు చేయించుకోవలసినదిగా దేవస్థానం కోరింది.

*16న ఉదయం 9 గంటలకు స్థానిక పర్యాటక శాఖ వారు బోటింగ్ ప్రారంభిస్తున్నారు. రోప్వే స్టేషన్ వద్ద ఈ ప్రారంభ కార్యక్రమము ఉంటుంది.

*MUTTAMSETTI SRINIVASA RAO (AVANTHI SRINIVAS),  MINISTER FOR TOURISM, CULTURE AND YOUTH ADVANCEMENT, GOVERNMENT OF ANDHRA PRADEH visited the temple. E.O. and others received with temple maryaadha.

* Repala Srinivasa Rao, State information Commissioner Govt.of AP, visited the temple. Officials received with temple maryaadha.

* శ్రీశైలం కార్తీక మాసోత్సవాల ఏర్పాట్లు:

16నుంచి కార్తిక మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ కార్తీక మాసోత్సవ నిర్వహణకు వివిధ విస్తృత ఏర్పాట్లు చేసారు. ముఖ్యంగా కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఈ కార్తీకమాసోత్సవాలు నిర్వహిస్తారు.

భక్తులకు వసతి, మంచినీటి సరఫరా, సౌకర్యవంతమైన దర్శనం, స్వామిఅమ్మవార్ల ఆర్జితసేవలు, పారిశుద్ధ్యం, సోమవారాలు, పౌర్ణమి రోజులలో లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి, కార్తీక పౌర్ణమిరోజున జ్వాలాతోరణోత్సవం, నదీహారతి మొదలైన వాటికి సంబంధించి పలు ఏర్పాట్లు చేసారు.

కోవిడ్ నిబంధనలు : • కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా పలు ప్రత్యేక చర్యలు,  ముందస్తు జాగ్రత్తలు

తీసుకుంటున్నార .  దర్శనానికి విచ్చేసే భక్తులు తప్పనిసరిగా ఆన్లైన్ లో దర్శనాల రిజిస్ట్రేషన్ చేయించుకోవలసినదిగా

ఇప్పటికే ప్రసార మధ్యామాల ద్వారా భక్తులకు తెలిపారు. • టైమ్ స్లాట్ పద్ధతిలో  ఆన్లైన్ నమోదు ఆధారంగా కేటాయించిన  నిర్ణీత సమయాలలో

భక్తులను దర్శనానికి అనుమతీస్తారు. • క్షేత్రానికి విచ్చేసే భక్తులు ముందస్తుగా కోవిడ్ పరీక్షలు చేయించుకోవలసినదిగా సూచించారు. • కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా 10 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వయస్సు గల వారిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. • 65 సంవత్సరాలు పైబడిన వారు ప్రస్తుతానికి వారి యాత్రను వాయిదా వేసుకోవలసినదిగా విజ్ఞప్తి • దర్శనానికి విచ్చేసే భక్తులు తమ ఆధార్ / గుర్తింపుకార్డును తప్పనిసరిగా తీసుకురావలసి వుంటుంది.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ టోకనును వారి గుర్తింపు కార్డుతో సరిపోల్చిన తరువాతనే దర్శనానికి అనుమతీస్తారు. • దర్శనాలకు విచ్చేసే భక్తులందరు కూడా తప్పనిసరిగా మాస్కు ధరించవలసి ఉంటుంది. విధిగా భౌతికదూరాన్ని పాటించవలసి వుంటుంది. • క్యూలైన్లలో భక్తులు  దూరాన్ని పాటించేందుకు వీలుగా గతంలోనే వృత్తాలతో మార్కింగ్ చేసారు . • దర్శన ప్రవేశద్వారం ప్రత్యేక కేంద్రంలో ఏర్పాటు చేసి ధర్మల్ గన్ ద్వారా శరీర ఉష్ణోగ్రతను పరీక్షిస్తారు.

  • ఈ ప్రత్యేక కేంద్రం వద్దనే ఆన్లై లో పొందిన దర్శన రిజిస్ట్రేషన్ పత్రాన్ని స్కాన్ చేసి దర్శనానికి

అనుమత స్తారు . • భక్తుల సౌకర్యార్ధం క్యూలైన్ ప్రవేశమార్గం వద్ద, , ఆలయం నుంచి వెలుపలికి వచ్చే

మార్గములోనూ భక్తులు చేతులు శుభ్రపరుచుకునేందుకు వీలుగా మరిన్నీ నీటి కుళాయిలు ఏర్పాటు చేసారు. చేతులను శానిటైజేషన్ చేసుకునేందుకు వీలుగా క్యూలైన్ ప్రవేశద్వారంవద్ద, మహాద్వారం వద్ద,  పలు చోట్ల మరిన్ని శానిటైజర్లను ఏర్పాటు చేసారు. భక్తుల సౌకర్యార్థం పలుచోట్ల లెగ్ ఆపరేటెడ్ శానిటైజింగ్ స్టాండులను ఏర్పాటు చేసారు.

ముందుజాగ్రత్త చర్యలలో భాగంగా ఎప్పటికప్పుడు క్యూలైన్లను శుభ్రం చేస్తారు. • ముఖ్యంగా క్యూలైన్ల పైపులు, ఆలయప్రాంగణంలోని కటంజనాలను, మెట్ల మార్గములోని రైలింగులు మొదలైనవాటిని నిర్ణీత సమయాలలో శాస్త్రీయ పద్ధతిలో శానిటైజెషన్ చేస్తారు• కరోనాను అరికట్టేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలు, నివారణ చర్యలు మొదలైన వాటి గురించి భక్తులలో అవగాహన కలిగించేందుకు దేవస్థానం ప్రసార వ్యవస్థ ద్వారా (మైకుద్వారా) ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తారు. కరోనా అరికట్టే విషయమై భక్తులలో అవగాహన కల్పించేందుకు,  తీసుకోవలసిన జాగ్రత్తల

గురించి మరిన్ని ఫ్లెక్సీ బోర్డులను కూడా పలు చోట్ల ఏర్పాటు చేస్తున్నారు. దర్శనం ఏర్పాట్లు : • ప్రస్తుతం ఆచరణలో ఉన్నట్లుగానే కార్తీకమాసంలో కూడా శ్రీస్వామిఅమ్మవార్ల లఘుదర్శనానికి

(దూరదర్శనానికి) మాత్రమే అవకాశం కల్పించారు. • వేకువజామున గం. 4.00లకు ఆలయ ద్వారాలు తెరచి ఉదయం గం. 5.30ని.ల నుంచి

సాయంకాలం గం.4.00ల వరకు, తిరిగి సాయంత్రం గం. 5.30 నుండి రాత్రి గం.10.00ల వరకు

దర్శనాలకు అనుమతిస్తారు . ఆర్జిత సేవలు : • కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రతిరోజూ నాలుగు విడతలుగా సామూహిక అభిషేకాలు

నిర్వహిస్తారు. • ఆర్టిత అభిషేకాలలో మొదటి విడతను ఉదయం . గం. 6.30 లకు : రెండవ విడతను ఉదయం గం. 8.30లకు : మూడవ విడతను ఉదయం గం. 11.30లకు : నాలగవ విడతను సాయంత్రం గం.6. 30లకు జరిపిస్తారు.

ఆర్జిత హోమాలు కూడా రెండు విడతలుగా నిర్వహిస్తారు . • రుద్రహోమం – మృత్యుంజయహోమాలలో మొదటి విడత ఉదయం గం. 8.00లకు 

రెండవ విడత గం. 9.30లకు జరుపుతారు. చండీహోమం మొదటి విడత ఉదయం గం. 7.30లకు రెండవ విడత ఉదయం గం.10.00లకు నిర్వహిస్తారు.

అన్నప్రసాదాల వితరణ : • కార్తీకమాసంలో ఉదయం గం.10.00ల నుంచి మధ్యాహ్నం గం. 3.30ల వరకు అన్నప్రసాదాలను

అందజేయబడుతాయి. • ఈ అన్నప్రసాదాలను పొట్లాల రూపంలో అందిస్తారు.

ఆలయ దక్షిణ మాడవీధిలో ఈ అన్నప్రసాద పొట్లాలను అందిస్తారు. • ఉదయం వేళలో క్యూలైన్లలోని భక్తులకు వేడిపాలు ఇస్తారు.

ఆకాశదీపం • 16 న  సాయంత్రం ఆలయప్రాంగణములో ఆకాశదీపం వెలిగిస్తారు.

కార్తీకామసం ముగింపు వరకు కూడా ప్రతిరోజూ ఈ దీపాన్ని వెలిగిస్తారు. • ఆలయ ప్రధాన ధ్వజస్తంభానికి పై భాగమున ఈ ఆకాశదీపాన్ని నెలకొల్పుతారు.  ప్రతిరోజు కూడా ధ్వజస్తంభం వద్ద ఈ ఆకాశదీపం వెలిగిస్తారు. • ఈ ఆకాశదీపాన్ని వెలిగించినా, చూసినా సకల పాపాలు నశించి, అనంతపుణ్యం కలుగుతుందని,వ్యాధులు తొలగి ఆయురారోగ్యాలు చేకూరుతాయని నమ్మకం.

లడ్డు ప్రసాదాలు : • కార్తీకమాసంలో వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరమైన సంఖ్యలో లడ్డు ప్రసాదాలు

సిద్ధం చేస్తారు. • మొత్తం 9 కౌంటర్ల ద్వారా ఈ లడ్డూ ప్రసాదాలు విక్రయిస్తారు.

  • విక్రయకేంద్రాల వద్ద కోవిడ్ నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. కార్తీకమాసం సందర్భంగా శివచతుస్సప్తాహ భజనలు : • లోకకల్యాణం కొరకు గతంలో వలనే ఈ సంవత్సరం కూడా కార్తీకమాసంలో అఖండ శివచతుస్సప్తాహ భజన కార్యక్రమం నిర్వహిస్తారు. . • కార్తీకమాసమంతా కూడా నిరంతరంగా శివభజనలను నిర్వహిస్తారు. పుష్కరిణి వద్ద లక్షదీ పార్చన,  పుష్కరిణి హారతి ,కార్తీక సోమవారాలు,  పౌర్ణమిరోజున “పుష్కరిణి ” వద్ద లక్షదీపార్చన,  పుష్కరిణి హారతి నిర్వహిస్తారు. • ఈ పుష్కరిణి హారతిలో దశవిధ హారతులు ఇస్తారు. వీటిలో ఓంకారహారతి, నాగహారతి,

త్రిశూలహారతి, నందిహారతి, సింహహారతి, సూర్యహారతి, చంద్రహారతి, కుంభహారతి,నక్షత్ర హారతి, కర్పూరహారతులను ఇస్తారు. కార్తీక దీపోత్సవం • భక్తులు కార్తీకదీపారాధన చేసుకునేందుకు వీలుగా ఆలయప్రాంగణంలోని నాగులకట్ట వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసారు.

  • భక్తులు భౌతికదూరాన్ని పాటిస్తూ ఈ దీపాలను వెలిగించుకోవలసి ఉంటుంది. పుణ్యనదీ హారతి • కార్తీక పౌర్ణమి (29.11.2020 – సాయంకాలం పౌర్ణమి ఘడియలు ఉండడంతో) రోజున కృష్ణవేణి నదీమ తల్లికి పుణ్యనదీహారతి కార్యక్రమం • పాతాళగంగ వద్ద ఉన్న కృష్ణవేణీ విగ్రహానికి పూజాదికాలు చేస్తారు. • కోవిడ్ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని పరిమిత సంఖ్యలో అర్చకులు,వేదపండితులు నిర్వహిస్తారు.
  • జ్వాలా తోరణం • కార్తీక పౌర్ణమి (29.11.2020 – సాయంకాలం పౌర్ణమి ఘడియలు ఉండడంతో ఆ రోజున ఆలయం ముందుగల గంగాధర మండపం వద్ద జ్వాలాతోరణోత్సవం నిర్వహిస్తారు.
print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.