మార్చి 15 వ తేదీన ప్రారంభమైన శ్రీశైలం ఉగాది మహోత్సవాలు 19 వ తేదీన వివిధ పూజలు , సేవలతో ఘనంగా ముగిసాయి . దేవస్థానం వారు తీసుకున్న పలు చర్యలతో బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా ముగిసాయి .అర్చకస్వాములు ప్రతిరోజు పూజలు ,సేవలు శాస్త్రోక్తంగా నిర్వహించారు .వివిధ వినతులకు భక్తులు కూడా స్పందించి సహకరించారు . ప్రతిరోజు భక్తి సంగీత విభావరి అలరించింది . కళారూపాలు , విన్యాసాలు భక్తులకు ఉత్సాహం కలిగించాయి . పారిశుద్ధ్య పనులు వీలున్నంత ఎక్కువగా జరపడం , మంచినీటి సదుపాయం కల్పించడం వల్ల భక్తులకు ఆనందం కలిగింది . అల్పాహారం , అన్నప్రసాద వితరణతో భక్తులకు ఆహ్లాదం కలిగింది .మొత్తం మీద ఈ మహోత్సవాలు భక్తులకు , దేవస్థానం వారికి తీయని జ్ఞాపకాలు మిగిల్చాయి . శ్రీశైల శ్రీస్వామి అమ్మవార్లకు అంతా వందనం సమర్పించారు .