తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయుడబ్ల్యుజె-ఐజేయు) పెద్దపల్లి జిల్లా ప్రథమ మహాసభ ఆదివారం జిల్లా కేంద్రంలోని సాయిరాం గార్డెన్స్ లో ఘనంగా జరిగింది. జిల్లా పరిధిలోని పెద్దపల్లి, మంథని, గోదావరిఖని నియోజకవర్గాల నుండి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇప్పటికే జగిత్యాల, సిరిసిల్లా, కరీంనగర్ జిల్లాల మహాసభలను విజయవంతంగా పూర్తి చేసుకున్న టీయుడబ్ల్యుజె, ఆదివారం పెద్దపల్లి జిల్లా మహాసభతో ఉమ్మడి జిల్లాలో 1200 పైచిలుకు సభ్యత్వాలను సేకరించి అత్యధిక జర్నలిస్టుల ప్రాతినిధ్య సంస్థగా తన స్థానాన్ని పదిలం చేసుకోవడం విశేషం అని యునియాన్ నాయకులు చెప్పారు .
పెద్దపల్లిలో జరిగిన జిల్లా మహాసభలో శాసన సభ్యులు మనోహర్ రెడ్డి, పుట్టా మధు, టీయుడబ్ల్యుజె రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ, రాష్ట్ర నాయకులు తాడూరి కరుణాకర్, ఎ. రాజేష్ , పిట్టల రాజేందర్, అయిలు రమేష్, ఉమ్మడి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా విభాగం బాధ్యులు ఈద మధుకర్ రెడ్డి, పెద్దపల్లి జిల్లా నాయకులు సంపత్, సత్య, వంశీ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా అధ్యక్షులుగా సంపత్ గౌడ్ :
టీయుడబ్ల్యుజె-ఐజేయు పెద్దపల్లి జిల్లా సర్వసభ్య సమావేశంలో నూతన కమిటీని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా సంపత్ గౌడ్(పెద్దపల్లి), కార్యదర్శిగా సత్య(గోదావరిఖని)లు ఎన్నికయ్యారు.