అమరావతి: ఉమ్మడి రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. శుక్రవారం సాయంత్రం విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో గవర్నర్ బిశ్వభూషన్, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆంధ్ర రాష్ట్ర సాంస్కృతి, సంప్రదాయాలు ఉట్టి పడేలా వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా హస్తకళలు, చేనేత కళల ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆంధ్రా ఆహార పదార్థాల స్టాల్స్ నోరూరించాయి. ఈ సందర్భంగా స్వతంత్ర యోధుల కుటుంబాలను ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సత్కరించారు.
చిత్తూరు: ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు చిరస్మరణీయులని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్పర్సన్ ఆర్కే రోజా పేర్కొన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో నిర్వహించిన అవతరణ దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొని పొట్టి శ్రీరాములు చిత్రపటానికి నివాళులర్పించారు.