శ్రీశైల దేవస్థానం:ఘంటామఠ పునర్నిర్మాణ పనుల నాణ్యతపై ప్రత్యేకశ్రద్ధ అవసరమని శ్రీశైల దేవస్థానం ఈ ఓ సూచించారు. ఘంటామఠ పునర్నిర్మాణ పనుల పరిశీలన, ప్రాచీన కట్టడాల పరిరక్షణలో భాగంగా దేవస్థానం చేపట్టిన ఘంటామఠ పునర్నిర్మాణ పనులను ఈ రోజు కార్యనిర్వహణాధికారి పరిశీలించారు. ఈ పరిశీలనలో స్థానిక తెలుగు విశ్వవిద్యాలయ ఆచార్యులు ఆర్.చంద్రశేఖరరెడ్డి కూడా పాల్గొన్నారు. ప్రాచీన నిర్మాణ శైలికి ఎలాంటి విఘాతం కలగకుండా ఈ పునర్నిర్మాణ పనులను చేస్తున్నారు.ఇప్పటికే ఘంటామఠం ప్రాంగణ ప్రధానాలయపు గర్భాలయం, అంతరాలయం, ముఖమండపం, విమాన గోపుర పునర్నిర్మాణ పనులు పూర్తి చేసారు.ప్రస్తుతం ఉపాలయాల పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ పునర్నిర్మాణ పనులు త్వరలో పూర్తయ్యేందుకువీలుగా వేగవంతంగా ఈ పనులను చేస్తున్నారు.
పునర్నిర్మాణ పనుల నిరంతర చిత్రీకరణకు వీలుగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసారు. అదేవిధంగా భద్రతా చర్యలలో భాగంగా రోజువారి విధులకుగాను మూడు షిప్టులలో కూడా ప్రత్యేకంగా భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసారు. కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ పునర్నిర్మాణ పనులలో, పనుల నాణ్యత పట్ల ప్రత్యేకశ్రద్ధ కనబర్చాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. విధుల నిర్వహణ సమయం లో పూర్తి అప్రమత్తంగా ఉండాలని అక్కడి భద్రతా సిబ్బందిని ఆదేశించారు. ఈ పరిశీలనలో అసిస్టెంట్ స్థపతి ఐ. జవహర్ తదితర ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
శిలా శాసన పరిశీలన:
ఘంటామఠ ప్రాంగణములోని ద్వారబంధనంపై చెక్కిన శిలాశాసనాన్ని కూడా తెలుగు విశ్వవిద్యాలయ ఆచార్యులు ప్రొఫెసర్ చంద్రశేఖరరెడ్డితో కలిసి కార్యనిర్వహణాధికారి పరిశీలించారు.ఈ శాసనపాఠాన్ని గుర్తించేందుకు వీలుగా శాసన ఛాయా చిత్రాన్ని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, (ఏ.ఎస్.ఐ) మైసూర్ వారికి కూడాపంపారు.
ఏ.ఎస్.ఐ. ఎపిగ్రఫీ ( శాసనాల విభాగం) డైరెక్టర్ చరవాణి ద్వారా కార్యనిర్వహణాధికారి తో మాట్లాడుతూ ఈ శాసనం 17వ శతాబ్దం నాటిదిగా ప్రాథమికంగా గుర్తించవచ్చని పేర్కొన్నారు. శాసనలిపిని బట్టి ఈ నిర్ధారణ చేయవచ్చునని అన్నారు.
కామిలేటి చముండయ అనే భక్తుడు శ్రీమల్లికార్జునస్వామివారి కైంకర్యానికి కొంత భూమిని సమర్పించినట్లుగా ఈ శాసనం ద్వారా తెలుస్తోందన్నారు.
అయితే పూర్తి వివరాలకోసం ఈ శాసన పాఠాన్ని మరింతగా విశ్లేషించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.
*Aditya Nath Das , IAS, Special Chief Secretary to Government, Water Resources Department, A.P. Secretariat visited Srisaila Temple today. E.O. and other officials received with temple maryaadha.