గాంధీ వైద్య శాలకు అగర్వాల్ సమాజ్ సహాయత ట్రస్ట్ సాయం
5 డయాలిసిస్ యునిట్ల ఏర్పాటుకు ఆర్థిక సాయం
వైద్య మంత్రి లక్ష్మా రెడ్డి ని కలిసిన ట్రస్ట్ సభ్యులు
హైదరాబాద్ : హైదరాబాద్ లోని అగర్వాల్ సమాజ్ సహాయత ట్రస్ట్ ప్రభుత్వ గాంధీ వైద్య శాలలో 5 డయాలిసిస్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి స్వచ్చందంగా ముందుకు వచ్చింది. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు తామే చేస్తామని ట్రస్ట్ చెప్పింది
ఈ మేరకు ట్రస్ట్ చైర్మన్ కరోడిమల్ అగర్వాల్ మేనే జింగ్ trusti రాజేష్ అగర్వాల్, గోపాల్ దాస్ అగర్వాల్ లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మా రెడ్డిని అసెంబ్లీలో trslp లో కలిశారు. ట్రస్ట్ చేయాలనుకుంటున్న సాయం పై వివరించారు.
ఇటీవల కిడ్నీ సంబంధ సమస్యలతో బాధ పడుతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతున్నది. అలాంటి వాళ్ళ కోసం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ, సీఎం కెసిఆర్ సూచనల మేరకు జిల్లా కేంద్రాల్లో డయాలిసిస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. తెలంగాణ సర్కార్ చేపట్టిన ఈ యూనిట్ల ఏర్పాటులో తాము సైతం అంటూ ముందుకు వచ్చింది హైదరాబాద్ లోని అగర్వాల్ సమాజ్ సహాయత ట్రస్ట్. విద్య, వైద్యం, నిరుపేదల వివాహాలకు సాయంగా నిలుస్తున్న ఆ ట్రస్ట్, తెలంగాణ ప్రభుత్వ వైద్యానికి తోడవనుంది. గాంధీ వైద్య శాలకు 5 డియాలసిస్ కేంద్రాల ఏర్పాటుకి సుముఖత వ్యక్తం చేసింది. అంతేగాక వైద్య మంత్రి లక్ష్మా రెడ్డిని trslp కార్యాలయంలో కలిసి తమ నిర్ణయాన్ని తెలిపారు అందుకు మంత్రి సుముఖుత వ్యక్తం చేశారు. నిరుపేదలకు వైద్యంలో సేవలు అందించాలనే ట్రస్ట్ ఆలోచనను మంత్రి అభినందించారు. దాతలు, వితరణ శీలురు ఎవరైనా ప్రభుత్వ వైద్యానికి తొడవడానికి ముందుకు వస్తే అహ్వానిస్తామన్నారు.
హైదరాబాద్ లోని అగర్వాల్ సమాజ్ సహాయత ట్రస్ట్ చేసే ఈ వితరణ ద్వారా, గాంధీ వైద్య శాలకు 5 డియాలిసిస్ యంత్రాలు, ఇక మంచినీటి ప్లాంట్, ఫర్నిచర్,ఏసీ లు, బెడ్స్ వంటి అన్ని సదుపాయాలు కలుగుతాయి. ఐతే గాంధీ వైద్యశాలలో ఒక ప్రత్యేక భవనం అందించడంతో పాటు, నిర్వహణ బాధ్యతను తీసుకోవాల్సి ఉంటుంది.
తెలంగాణ ప్రభుత్వం, సీఎం కెసిఆర్, వైద్య శాఖా మంత్రి లక్ష్మారెడ్డి, నిరుపేదలకు వైద్యం అందించడానికి పడుతున్న తపనను చూశామని, అలాగే, అన్నీ కేవలం ప్రభుత్వమే చేయడం సాధ్యం కాదని, ప్రజలు, స్వచ్ఛంద సేవ సంస్థలు ముందుకు వచ్చి సాయంగా నిలవాలన్నారు ట్రస్ట్ బాధ్యులు
కరోడిమల్ అగర్వాల్ మేనే జింగ్ trusti రాజేష్ అగర్వాల్, గోపాల్ దాస్ అగర్వాల్ లు. అవసరమైతే, మరిన్ని యూనిట్ల ఏర్పాటుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.