డిఎంకె పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు ఇలాంగోవన్ శనివారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిశారు. ఆగస్టు 30న చెన్నయ్ లో నిర్వహించే ‘రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి – ఫెడరలిజం’ అనే అంశంపై నిర్వహించే సదస్సుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆహ్వానిస్తూ డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకె స్టాలిన్ రాసిన లేఖను అందించారు.