తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర శంఖారవం సభ సోమవారం నాడు తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో నిర్వహించనున్నారు. ఈసమావేశంలో పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి బూత్ కమిటీ సభ్యులు, పార్టీ శ్రేణులతో భేటీ కానున్నారు. వచ్చే ఎన్నికలను సమర్ధంగా ఎదుర్కొనేలా పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశనం చేస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. సమరశంఖారావానికి ముందు ఉదయం గంటలకు నాగమల్లి తోటలోని ద్వారంపూడి భాస్కరరెడ్డి పద్మావతి కల్యాణమండపంలో తటస్థులతో వైయస్ జగన్ భేటీ సమావేశమవుతారని ఆయన తెలిపారు. ఈ రెండు కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయని, పార్కింగ్ తదితర ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వివరించారు.
14న విజయవాడలో సమర శంఖారావం
ఈ నెల 14న విజయవాడలో వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో సమర శంఖారావం జరుగుతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ తెలిపారు.