* కర్నూలు వచ్చిన రాష్ట్ర మాంసం అభివృద్ధి సంస్థ చైర్మన్ చంద్ర దండు ప్రకాష్ నాయుడు
* మటన్ చికెన్ సెంటర్ లఆకస్మిక తనిఖీలు
కర్నూలులో నగరపాలక అధికారులు అలర్టయ్యారు. ప్రజల్లో భయాందోళనలను పారదోలడంతోపాటు.. అనారోగ్యకరమైన గొర్రెలను, కోళ్లను కోసి మాంసం విక్రయించకుండా తనిఖీలు ప్రారంభించారు. కబేళాల్లో ఆకస్మిక తనిఖీలు చేసిన అధికారులు ఇవాళ తెల్లవారు జాము నుంచి నగరంలోని మటన్ దుకాణాల్లో ముమ్మరంగా తనిఖీలు చేశారు. పండుగ సీజన్లో సొమ్ము చేసుకునేందుకు అనారోగ్యకరమైన గొర్రెలను.. ఎక్కడపడితే అక్కడ రోడ్ల పక్కన ఈగలు, దోమలు ముసురుకుంటున్న చోట్ల పూర్తి అనారోగ్యకరమైన వాతావరణంలో విక్రయిస్తుండడం చూసి అవాక్కయ్యారు. అనారోగ్యకరంగా ఉన్మ మాంసం శాంపిళ్లను సేకరించి ల్యాబ్ కు పంపించారు ముఖ్యంగా పండుగల సీజన్లో మాంసం కల్తీ చేస్తున్నారనే అనుమానాలు చెలరేగుతున్న నేపధ్యంలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.
మద్దూర్ నగర్, సి.క్యాంప్ సర్కిల్, అమ్మ హస్పటల్, కల్లూరు చెన్నమ్మ సర్కిల్, బస్టాండ్ తదితర ప్రాంతాలల్లో అనుమతి ఉన్న మటన్ దుకాణలతోపాటు.. అనుమతి లేకుండా దుకాణాలు పెట్టి విక్రయిస్తుండడం గుర్తించారు. అపరిశుభ్రంగా.. ఈగలు.. దోమలు ముసురుకుంటున్న చోట్ల మాంసం కోసి విక్రయిస్తుండడంతో మందలించి భారీ జరిమానా విధించారు. అపరిశుభ్రమైన వాతావరణంలో విక్రయిస్తుంటే ఎలా కొంటున్నారని.. తమకు ఫిర్యాదు చేయాల్సిందిగా ప్రజలకు సూచనలిచ్చారు.