కరోనా నివారణకు చర్యలన్నింటిని పకడ్బందీగా అమలు చేయాలి-శ్రీశైల దేవస్థానం ఈ ఓ

శ్రీశైల దేవస్థానం: కరోనా నివారణకు  తీసుకున్న  చర్యలన్నింటిని పకడ్బందీగా అమలు చేయాలని  శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆదేశించారు .కార్యనిర్వహణాధికారి  ఈ రోజు 6న  కల్యాణకట్టను  ఆకస్మికంగా పరిశీలించారు. ముందుగా కల్యాణకట్టలో ఉద్యోగుల డ్యూటీచార్టును, వారి హాజరు నమోదును పరిశీలించారు. అదేవిధంగా టికెట్ కౌంటరును తనిఖీ చేశారు. ప్రతి ఉద్యోగి కూడా  ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు. ఏమాత్రం ఏమరుపాటు లేకుండా ప్రతి ఉద్యోగి కూడా పూర్తి జాగ్రత్తలను పాటించాలన్నారు.ముఖ్యంగా కల్యాణకట్టలో భౌతిక దూరం పాటించడం పట్ల ప్రత్యేకశ్రద్ధ కనబర్చాలన్నారు. ఈ విషయమై ఉద్యోగులే భక్తులలో అవగాహన కలిగించాలన్నారు. కేశఖండనానికి వినియోగించిన బ్లేడ్లు,  వ్యర్థాలను సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంతో నింపిన వాటర్ ప్రూఫ్ కంటైనర్ లోనే వేయాలన్నారు.కోవిడ్ నివారణకు  తీసుకోవలసిన ముందు జాగ్రత్తలగురించి కల్యాణకట్ట ప్రాంగణములో మరిన్ని సూచనబోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. 

 కరోనా నివారణ చర్యలలో భాగంగా కల్యణాకట్టలో పలు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. కల్యాణకట్టలో విధులు నిర్వర్తిస్తున్న క్షురకులకు పీపీఇ కిట్స్ , చేతితొడుగులు (హ్యాండ్ గెస్)అందించారు.కల్యాణకట్ట ప్రవేశద్వారం వద్ద హ్యాండ్ శానిటైజర్లు అందుబాటులో ఉంచారు. కల్యాణకట్టలో ప్రవేశించేముందు భక్తుల శారీరక ఉష్ణోగ్రతను థర్మల్ గన్ తో తనిఖీ  చేస్తున్నారు. అటు ఉద్యోగులు, ఇటు భక్తులు తప్పనిసరిగా ముఖానికి మాస్కులు ధరించే నిబంధనను అమలు చేస్తున్నారు. తలనీలాలు తీసే పరికరాలను ఎప్పటికప్పుడు 10 నుండి 15 నిమిషాల పాటు డెట్టాల్ తో శుభ్రపరుస్తున్నారు. ఎప్పటికప్పుడు శుభ్రపరిచి వినియోగించు కునేందుకు వీలుగా ప్రతి ఉద్యోగికి కూడా రెండు జతల పరికరాలు అందించారు.ముఖ్యంగా కేశఖండనశాలలో అవసరమైన మేరకు గీజర్లు ఏర్పాటు చేసారు.  ప్రతి క్షురకునికి కూడా వేడినీటిని అందుబాటులో ఉంచారు.కరోనా నివారణకు  చేపట్టవలసిన ముందు జాగ్రత్తల గురించి అవగాహన కలిగే విధంగా కల్యాణకట్ట ప్రాంగణములో ఫ్లెక్సీబోర్డులు కూడా ఏర్పాటు చేసారు .కల్యాణకట్టప్రాంగణమంతా తరచుగా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణముతో పిచికారి చేస్తున్నారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.