ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య సఖ్యత ఉంటే… దుమ్ముగూడెం– సాగర్‌ ప్రాజెక్టు సాకారం

తిరుప‌తి:  జీవిత‌కాల‌మంతా మీతో క‌లిసి ప్ర‌యాణించాల‌న్న‌దే నా ఉద్దేశ‌మ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నాయ‌కులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. బుధ‌వారం తిరుప‌తిలో అన్న పిలుపు కార్య‌క్ర‌మంలో భాగంగా త‌ట‌స్థులు, మేధావులు, సంఘ‌సేవ‌కుల‌తో వైయ‌స్ జ‌గ‌న్ భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా వారి స‌లహాలు, సూచ‌న‌లు స్వీక‌రించిన వైయ‌స్ జ‌గ‌న్ వారిని ఉద్దేశించి ప్ర‌సంగించారు. అనంత‌రం భేటీలో పాల్గొన్న ప‌లువురు వైయ‌స్ జ‌గ‌న్‌తో ముఖాముఖి చ‌ర్చించారు. ఆ సంభాష‌ణ ఇలా..

 న్యాయవాది వాణి : అధికారపార్టీ అక్రమాలను చాలా మంది తట్టుకోలేక పోతున్నారు. పార్టీ తరఫున లీగల్‌ సెల్‌ను మరింత బలోపేతం చేయాలి

గడచిన రెండేళ్లుగా మామిడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మదనపల్లె ప్రాంతంలో టమోటా రైతులు ఇబ్బండి పడుతున్నారు. మార్కెట్‌యార్డుల్లో అక్రమంగా 20 శాతం ఫీజులు వసూలు చేస్తున్నారు. మామిడి, టమోటా రైతులు కష్టాలు తీర్చాలి. హైదరాబాద్‌లో కేజీ మామిడిని రూ.60–70 లకు అమ్ముతున్నారు. కాని రైతు దగ్గర రూ.10–12లకు కొంటున్నారు. ఇంత తేడా ఎందుకు వస్తుంది, రైతు ఎలా బతుకుతాడు. కనీస మద్దతు ధరలు ప్రకటించినా అవి రైతులకు అందడంలేదు. ఎక్కడ అమ్మితే కనీస మద్దతు ధర వస్తుందో వారికి తెలియదు. –  పి.వెంకటరెడ్డి, రైతు

వైయస్‌ జగన్‌: ప్రజాసంకల్ప యాత్రలో దీనిపై నేను బాగా ప్రస్తావించా. ఇదే జిల్లాలో టీడీపీ నాయకులు గల్లా, ఆదికేశవుల కుటుంబానికి చెందిన శ్రీని ఫుడ్స్, పక్కనే హెరిటేజ్‌ ఫుడ్స్‌.. ఇవన్నీ కూడా రైతులనుంచి తక్కువ ధరలకు కొనుగోలు చేశారు: వీళ్లే ఇలా చేస్తే.. ఇక రైతులకు ఎలా మద్దతు ధర వస్తుంది. ఈ సమస్యపై పూర్తి అవగాహన ఉంది. కెప్టెన్‌గా ఉన్నవాడు దళారీలకు కెప్టెన్‌ కాకపోతే రైతులకు మద్దతు ధరలు వస్తాయి. కాని ఇప్పుడున్న ముఖ్యమంత్రి దళారీలకు కెప్టెన్‌ అయ్యాడు. రైతుల దగ్గరనుంచి తక్కువ ధరలకు ఆయనే కొనుగోలు చేసి.. నాలుగు రెట్లకు ప్యాక్‌ చేసి అమ్ముతున్నాడు.  నాన్నగారి హయాంలో రైతులకు లభించిన ధరలు మీ అందరికీ తెలుసు.  రూ. 3వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి పెడుతున్నాం. ఆ రూ.3వేల కోట్లు పోయినా ఫర్వాలేదు. పంటవేసేముందు రైతులకు ధరను నిర్ణయిస్తాం .ప్రభుత్వ రంగంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ప్రక్రియను ప్రోత్సహిస్తాం. అధికారంలోకి రాకముందు, వచ్చిన తర్వాత తేడాను కచ్చితంగా చూపిస్తాం.

ప్రసన్న కుమార్, కుప్పం: కుప్పంలో తాగునీటి సమస్య ఉంది. పాలారు ప్రాజెక్టు మధ్యలో నిలిచిపోయింది. చంద్రబాబు సీఎం అయినా పాలేరు ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదు
వైయస్‌జగన్‌:  నాన్నగారు చనిపోయిన తర్వాత దాని గురించి పట్టించుకోలేదు. కుప్పానికి మేలు చంద్రబాబు చేయలేదు గానీ, రాజశేఖరరెడ్డి గారు, ఆయన కొడుకు చేస్తాడని గట్టిగా చెప్తున్నాను.  ప్రజల కష్టాలు అర్థంచేసుకుని మీరు నవరత్నాలు ప్రకటించారు. ఫ్యాక్టరీలు ఒక జట్టుగా మారిపోయారు  మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి ఫ్యాక్టరీల యజమానులతో కుమ్మక్కు అయ్యాడు. అన్నీ పచ్చచొక్కాలకే చేస్తున్నారు. చంద్రబాబు అన్నీ అబద్ధాలే చెప్తున్నారు. ఆయన చేసిన ప్రమాణానికి అర్థం లేకపోయింది. అంతా పక్షపాతమే. రాజంటే.. ప్రజలందర్నీ సమానంగా చూసుకోవాలి. పోలీసులు, అధికారులు అందరూ పక్షపాతం చూపిస్తున్నారు. మతం, కులాన్ని అడ్డుపెట్టుకుని పక్షపాతం చేస్తున్నారు. నవరత్నాలను ఇప్పుడు దొంగిలిస్తున్నారు :

హేమ చంద్ర: ఆరోగ్య శ్రీకి జబ్బు చేసింది. మన్నవరం ప్రాజెక్టును పట్టించుకోవడంలేదు. మన్నవరం ప్రాజెక్టు పూర్తయి ఉంటే 5వేలమందికి ఉద్యోగాలు వచ్చేవి. కాని ఇప్పుడు 10 మంది సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలు ఇస్తున్నారు. శ్రీకాళహస్తిలో సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలు చేస్తున్నారు.

 

వైయ‌స్ జ‌గ‌న్‌:  ఎన్టీపీసీ, బీహెచ్‌ఈఎల్‌ ఈ రెండూ కలిపి ఏర్పాటుచేస్తున్న ప్రాజెక్టు మన్నవరం ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు ఎక్కడ పెట్టాలన్న దానిపై ఆలోచన చేస్తున్నప్పుడు ఈ ప్రాంతానికి రావాలని వైయస్సార్‌ గట్టి పట్టు పట్టారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి మరీ ఈ ప్రాజెక్టును సాధించారు.ఆయన మరణం తర్వాత ప్రాజెక్టు పూర్తిగా నిర్వీర్యం అయిపోతోంది. ప్రాజెక్టు కొలిక్కి రావడంలేదు. మనకు ఉద్యోగాలు రావాలంటే విప్లవాత్మక మార్పులు రావాలి. పరిశ్రమలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వాలి, ఆ పరిశ్రమల్లో మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి. ప్రాజెక్టుల వల్ల మన పిల్లలకు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయన్న దానిపై ముఖ్మమంత్రి ఒక తండ్రి మాదిరిగా వ్యవహరించాలి. దేవుడు దయవల్ల ప్రభుత్వ రాగానే పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే వచ్చేలా చట్టం తీసుకు వస్తాం. ప్రతి కంపెనీ అమలు చేయక తప్పని పరిస్థితి తీసుకు వస్తాం. ఉద్యోగాల కల్పనపై మా పాలనలో ప్రత్యేక దృష్టి. ఎంతమందికి ఉద్యోగాలు కల్పిస్తామన్నదే మా పాలనకు గీటురాయి అని చెప్తున్నా.
రాష్ట్రంలో  2.42లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కాని ఐదేళ్లలో ఇచ్చిన ఉద్యోగాలు సున్నా. 23 వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉంటే… వాటిని భర్తీచేయాలన్న ఆలోచన లేదు: ఉన్న స్కూళ్లను మూసేస్తున్నారు . గ్రామ సచివాలయాల ద్వారా ఉద్యోగాలు కల్పిస్తాం. వీటికి అనుసంధానంగా గ్రామ వాలంటీర్లను తీసుకొస్తాం. ప్రతి యాభై కుటుంబాలకు ఒకరిని వాలంటీర్‌గా పెడతాం. గ్రామ సెక్రటేరియట్‌తో అనుసంధానమై డోర్‌ డెలివరీ చేస్తారు. ఎవ్వరికీ లంచాలు ఇవ్వాల్సిన పనిలేదు. ప్రభుత్వ పథకాలకోసం తిరగాల్సిన పనిలేదు . ఏ ప్రభుత్వ పథకమైనా ఎలాంటి లంచాలు లేకుండా డోర్‌డోలివరీ ద్వారా ప్రజలకు చేరుతుంది. గ్రామ వాలంటరీకు ఒక్కొక్కరికీ రూ.5వేలు జీతం ఇస్తాం. ప్రత్యేక హోదా అన్నది మరొక ఎత్తు
25కి 25 మొత్తం ఎంపీ స్థానాలన్నీ మనమే సంపాదించుకుందాం. పూర్తి మెజార్టీతో కేంద్రంలో ఏ ప్రభుత్వమూ అధికారంలోకి రాదనే సంకేతాలు వస్తున్నాయి. ప్రత్యేక హోదాకు సంతకం పెడితే.. అప్పుడు మద్దతు ఇస్తాం. ప్రత్యేక హోదాకూడా వస్తే ఉద్యోగాల విప్లవాన్ని తీసుకు వస్తాం.
ప్రత్యేక హోదా ఉంటే ఆదాయపుపన్ను, జీఎస్టీ కట్టాల్సిన అవసరంలేదు. ఆరోగ్య శ్రీ పథకాన్ని వైయస్సార్‌గారు అమలు చేస్తున్నప్పుడు దేశం మొత్తం మనవైపు చూసింది. నాన్న కన్నా ఒక అడుగు ముందుకు వేసి ఆరోగ్య శ్రీ పథకాన్ని అమలు చేస్తాం.
భక్తవత్సలం, నారాయణవనం, సత్యవేడు:  చేనేతలు బాగా ఇబ్బంది పడుతున్నారు. జీఎస్టీతో వారి ఇబ్బందులు మరింత పెరిగాయి. చేనేతలకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి. వారికి ఉత్పత్తి వ్యయం తగ్గించాలి . గతంలో వైయస్సార్‌గారు రుణమాఫీచేసి.. చేనేతలను ఆత్మహత్యలనుంచి కాపాడారు. తమిళనాడులో 250 యూనిట్ల కరెంటును ఉచితంగా ఇచ్చారు.

వైయ‌స్ జ‌గ‌న్‌:  చేనేత‌ల‌ సమస్యలను నేను పాదయాత్రలో తెలుసుకున్నా. మగ్గం ఉన్న ప్రతి ఇంటికీ నెలకు రూ.2వేలు ఇస్తాం. నవరత్నాల్లో చెప్పినవి కాక ఈ సహాయం అందుతుంది. చేనేతలు ఆకలి బాధలకు గురికాకూడదు. ఆప్కోనుంచి చేనేతలకు రావాల్సిన బకాయిలు ఇప్పటికీ రావడం లేదు. ఆప్కో ఛైర్మన్లుగా ఉన్నవాళ్లు స్కూలు యూనిఫారమ్స్‌లోనూ లంచాలు తీసుకునే పరస్థితి ఉందని పాదయాత్రలో నాకు చెప్పారు. ఏ విధానమైనా చాలా పారదర్శకంగా ఉండేలా చేస్తాం.

రంగవరం శ్రీదేవి, తెలుగు భాషోద్యమ సంఘం: తెలుగుదేశం అని పేరుపెట్టుకున్నవాళ్లు తెలుగు భాషకు ఏమీ చేయలేదు. భాష కోల్పోతే జాతి సంస్కృతిని కోల్పోతుంది. తెలుగు భాషకు ప్రాచీన హోదా వచ్చి 10 ఏళ్లు అయ్యింది. కాని భాషాభివృద్ధికి ఎలాంటి చర్యల్లేవు.

పురుషోత్తం రెడ్డి, రాయలసీమ మేధావుల సంఘం: పిల్లలు పుట్టుకతోనే బలహీనంగా పుడుతున్నారు. మనకు కావాల్సింది సింగపూర్‌కాదు.
క్షేత్రస్థాయిలో ఈసమస్యలకు పరిష్కారంలేదు. చిత్తూరు జిల్లాలో ఒక్క ఎకరాకూ నీళ్లు అందడంలేదు. రాష్ట్రంలో అభివృద్ధిలో సమతుల్యత లేదు.
దీనిపై సమగ్రవిధానం రావాలి. రూజ్‌వెల్ట్‌ అమెరికాను సమగ్రంగా అభివృద్ధిచేశారు. ప్రాంతాలవారీగా ఉన్న అసమానతలను తొలగించాలి.

వైయ‌స్ జ‌గ‌న్‌: గోదావరిలో 3వేల టీఎంసీల కలిసిపోతున్నాయి. ఈ నీటిని దుమ్ముగూడెం– నాగార్జున సాగర్‌ టెయిల్‌ ప్రాజెక్టు ద్వారా సాగర్‌ను నింపాలని ట్రై చేశారు. కాని దురదృష్టవశాత్తూ నాన్నగారు చనిపోయారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య సఖ్యత ఉంటే… దుమ్ముగూడెం– సాగర్‌ ప్రాజెక్టు మెటీరియల్‌ అవుతుంది. మన రాష్ట్రానికే కాదు, తెలంగాణకు కూడా మేలు జరుగుతుంది. మంచి చేయగలిగే అవకాశం వస్తే కచ్చితంగా దీనికోసం అడుగులు వేస్తాను. ఇది జరిగితే పోలవరం ప్రాజెక్టుకు ఈనీళ్లు అదనం అవుతాయి

భాస్కర్‌: పీజు రీయింబర్స్‌మెంట్ కన్నా ఉచిత విద్య అందిస్తే బాగుంటుంది. బ్రాహ్మణులకు అపర కర్మలు చాలా ముఖ్యం. ప్రతి గ్రామంలో ఒక భవనం ఏర్పాటు చేయాలని కోరుతున్నాను. న్యాయవాదులకు స్టై ఫండ్‌ ఇవ్వాలి. న్యాయవాదులు మరణించాక వారి కుటుంబాలకు పెన్షన్‌ ఇవ్వాలి.
వైయ‌స్ జ‌గ‌న్‌: మనం వచ్చాక పూర్తిస్థాయి ఫీజు రీయింబ‌ర్స్‌ మెంట్‌ చెల్లిస్తాం. ఇంచుమించు మనం ప్రకటించిన పథకాలు అవే పద్ధతిలో ఉన్నాయి. న్యాయవాదులు ప్రజాసంకల్పయాత్రలో ఇదే కోరారు కచ్చితంగా చేస్తాం

print

Post Comment

You May Have Missed