ఇండియన్ ఆర్ట్ & కల్చర్ ట్రస్ట్ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ తెలంగాణ స్టేట్ వారు రవీంద్రభారతిలో యూరీలో మరణించిన 18 మందికి సంఘీ భావం తెలుపుతూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వీరులారా వందనాలు గీతం, నాగార్జున పాఠశాల విద్యార్థులు చేసిన దేశభక్తి ఇతివృత్తంతో స్కిట్, కొవ్వొత్తుల నృత్య ప్రదర్శన నివాళి, దేశ సైనికుల వేషదారణలో విద్యార్థుల ప్రదర్శనలు, మాళవిక ఆనంద్ మరియు మల్లికార్జున్ (చింటూ) పాడిన దేశభక్తి గీతాలు ఆకట్టుకునాయి. విద్యార్థుల ప్రదర్శనలతో ప్రేక్షకులను కన్నీటి పర్యంతం చేశారు. అలాగే అందరినీ ఆలోచింపచేశాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నాయిని నర్సింహారెడ్డి గారు మాట్లాడుతూ మనం ఎప్పుడు మన దేశ సరిహద్దులో ఉండి మనల్ని మన దేశాన్ని రక్షణ అందిస్తున్న సైనికులను జ్ఞప్తి చేసుకుంటాం అన్నారు, చలి , ఎండ, వాన లెక్క సేయకుండా దేశ సరిహద్దుల్లో మరణించిన వీర జవానులకు నివాళులు ఆర్పిస్తు కొద్దిసేపు మౌనం పాటించారు. ఈ ఘటనను మనం తిప్పి కొట్టాలి, అదే సైనికులకు గొప్ప నివాళి అన్నారు, మన దేశానికి ఆ శక్తి ఉందన్నారు. మనం ఇప్పటికీ సహనంగా ఉంటున్నాం అన్నారు, మన భారత శక్తితో తిరగబడితే అడ్రెస్స్ ఉండదన్నారు, జై జవాన్ అంటూ నినాదాలు చేశారు. వారినుద్దేశించి అందరితో ప్రతిజ్ఞ చేయించారు హోం మినిస్టర్గారు. మామిడి హరికృష్ణ గారు మాట్లాడుతూ వారికి సంఘీ భావం తెలపటం, ఈ చిన్నారుల ప్రదర్శనలు ఆలోచింపచేశాయి అన్నారు.. దేశ సేవ కోసం త్రివిద దళల్లో ఉన్న వారందరు అది గొప్పగా భావిస్తారు. కార్యక్రమంలో ఎన్సిసి డైరెక్టర్ SR GHARPURE , నజీబ్ గారు, కృష్ణ గౌడ్ నాగార్జున స్కూల్, ఆదర్శ పాటశాల, విజయ భారతి పాటశాల యాజమాన్యం, విద్యార్థులు, NCC కాడెట్లు పాల్గొన్నారు.